'కళాపురం'.. ఇక్కడ అందరూ కళాకారులే రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ | Karuna Kumar Director New Movie Kalapuram Gets Release Date | Sakshi
Sakshi News home page

Karuna Kumar: 'కళాపురం'.. ఇక్కడ అందరూ కళాకారులే రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Aug 17 2022 12:40 PM | Updated on Aug 17 2022 12:42 PM

Karuna Kumar Director New Movie Kalapuram Gets Release Date - Sakshi

‘పలాస 1978, శ్రీదేవి సోడా సెంటర్‌’ చిత్రాల ఫేమ్‌ కరుణ కుమార్‌ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘కళాపురం’. ‘ఈ ఊరిలో  అందరూ కళాకారులే’ అన్నది ఉపశీర్షిక. ‘సత్యం’ రాజేష్, ‘చిత్రం’ శ్రీను కీలక పాత్రల్లో నటించారు. రజనీ తాళ్లూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. కరుణ కుమార్‌ మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు    కంటెంట్‌ బేస్డ్‌ సినిమాలు చేశాను.

‘కళాపురం’ కామెడీ సినిమా. అయితే కామెడీలో అశ్లీలత ఉండవు’’ అన్నారు. ‘‘మా సినిమాని అందరూ ఎంజాయ్‌ చేస్తారు’’ అన్నారు రజనీ తాళ్లూరి. ‘‘మా మూవీ ప్రేక్షకులను బాగా నవ్విస్తుంది’’ అన్నారు ‘జీ స్టూడియో’ నిమ్మకాయల ప్రసాద్‌.‘‘క్యూట్‌ కామెడీ చిత్రమిది’’ అన్నారు ‘సత్యం’ రాజేష్‌. ‘‘చాలా రోజుల తర్వాత ఈ మూవీలో మంచి పాత్ర చేశాను’’ అన్నారు ‘చిత్రం’ శ్రీను. 

Advertisement
 
Advertisement
Advertisement