లంబోర్గిని కారు కొన్న కుర్ర హీరో, ధర ఎంతంటే? | Kartik Aaryan Buys New Lamborghini Car | Sakshi
Sakshi News home page

కరోనా నెగెటివ్‌: పాజిటివ్‌ న్యూస్‌ చెప్పిన యంగ్‌ హీరో

Apr 6 2021 5:22 PM | Updated on Apr 6 2021 6:14 PM

Kartik Aaryan Buys New Lamborghini Car - Sakshi

తనకు కరోనా పీడ విరగడైందని తెలిసిన తర్వాత ఈ హీరో ఏం చేశాడనుకుంటున్నారు? అదే సాయంత్రం ఓ కొత్త కారును..

కరోనా సెకండ్‌ వేవ్‌ బాలీవుడ్‌ను చిగురుటాకులా వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు బీటౌన్‌ సెలబ్రిటీలు కరోనా బారిన పడిగా మరికొందరు ఇప్పుడిప్పుడే దాని నుంచి కోలుకుని బయటపడుతున్నారు. ఈ క్రమంలో మార్చి 22న యంగ్‌ హీరో కార్తీక్‌ ఆర్యన్‌కు కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. 14 రోజుల క్వారంటైన్‌ ​తర్వాత అతడికి మళ్లీ పరీక్ష చేయగా నెగెటివ్‌ అని తేలింది. దీంతో తిరిగి సెట్స్‌లో అడుగు పెట్టనున్నాడీ కుర్ర హీరో.

అయితే తనకు కరోనా పీడ విరగడైందని తెలిసిన తర్వాత ఈ హీరో ఏం చేశాడనుకుంటున్నారు? అదే సాయంత్రం ఓ కొత్త కారును తన ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. అత్యంత ఖరీదైన లంబోర్గిని కారును కొనుగోలు చేసిన కార్తీక్‌ ముంబై వీధుల్లో సోమవారం దాన్ని నడుపుకుంటూ ఇంటికి తీసుకెళ్లాడు. దీని ధర ఇంచుమించు నాలుగున్నర కోట్ల రూపాయలుగా ఉందట. ఇక ఈ మధ్యే ప్రభాస్‌ ఏడు కోట్ల రూపాయలు విలువ చేసే లంబోర్గిని అవెంటాడర్‌ ఎస్‌ రోడ్‌స్టర్ కారును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

ఇదిలా వుంటే కార్తీక్‌ ప్రస్తుతం 'భూల్‌ భులైయా 2' సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో కియారా అద్వాణీ, టబు, రాజ్‌పాల్‌ యాదవ్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతో పాటు 'ధమాకా', 'దోస్తానా 2' చిత్రాలు చేస్తున్నాడు. 

చదవండి: హీరో కార్తీక్‌కు కరోనా..టెన్షన్‌లో కియారా అద్వానీ

అభిమాని ఫోన్‌ లాక్కున్న అజిత్‌

లంబోర్గిని కారులో ప్రభాస్‌ షికారు

Advertisement
 
Advertisement
Advertisement