ధనుష్‌ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా..: హీరో సోదరి | Karthika Krishnamoorthy: Karthick Anjee Done a Decent Job in Dhanush Raayan Movie | Sakshi
Sakshi News home page

నా భర్త సినిమాలో నటిస్తాడని జీవితంలో అనుకోలేదు: ధనుష్‌ సోదరి

Aug 5 2024 8:36 AM | Updated on Aug 5 2024 10:40 AM

Karthika Krishnamoorthy: Karthick Anjee Done a Decent Job in Dhanush Raayan Movie

ధనుష్‌.. ఇటీవల రాయన్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో హీరోగా నటించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించాడు. ధనుష్‌ బావ డాక్టర్‌ కార్తీక్‌ ఆంజనేయన్‌(సోదరి కార్తీక భర్త) తొలిసారి ఈ మూవీలో నటించాడు. అది కూడా పోలీస్‌గా..! తాజాగా కార్తీక.. తన భర్త పోలీస్‌ గెటప్‌లో ఉన్న ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

డాక్టర్‌తో యాక్టింగ్‌
రాయన్‌.. నా సంతోషాన్ని మీతో పంచుకోవాలని, ఈ ఫోటోలు షేర్‌ చేయాలని ఏడాదికిపైగా ఎదురుచూస్తున్నాను. డాక్టర్‌ కార్తీక్‌ ఆంజనేయన్‌.. ఒక పేరున్న డాక్టర్‌, కార్డియాలజిస్ట్‌. నా సోదరుడు ధనుష్‌ 50వ సినిమాలో ఈయన ఒక చిన్న పాత్ర చేస్తున్నాడని తెలిసి ఆశ్చర్యపోయాను. ధనుష్‌కు ఈయనలో ఏం కనిపించింది? తనను తీసుకోవడమేంటి? అని షాకయ్యాను. ఏం జరుగుతుందో చూద్దామని ఆతృతగా ఎదురుచూశాను. 

మురిసిపోయా
ధనుష్‌.. తన సహనటులను డైరెక్ట్‌ చేయడం కళ్లారా చూసి మురిసిపోయా.. ఒక డాక్టర్‌తో కూడా యాక్టింగ్‌ చేయించగలిగాడంటే తనను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. నా భర్తను వెండితెరపై చూస్తానని కలలో కూడా అనుకోలేదు. అలాంటిది అంత మంచి పాత్రలో కనిపించాడంటే ఆ క్రెడిట్‌ అంతా ధనుష్‌కే దక్కుతుంది. 

సంతోషంగా ఉంది
అంజీ చాలా బాగా నటించాడు. ధనుష్‌ హీరోగా నటించి, డైరెక్ట్‌ చేసిన మూవీలో ఈయన భాగమవడం గౌరవప్రదంగా ఉంది. ఇందుకు నా తమ్ముడికి ఎలా థ్యాంక్స్‌ చెప్పాలో అర్థం కావడం లేదు. ఒక సోదరిగా, భార్యగా సంతోషంగా ఉంది. రాయన్‌ టీమ్‌కు థ్యాంక్స్‌.. అని రాసుకొచ్చింది.

 

 

చదవండి: అంతకుమించి వేదా ఉంటుంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement