Youtuber Srikanth Reddy Shares Video About Karate Kalyani Attack, Seeks Support - Sakshi
Sakshi News home page

Karate Kalyani-Srikanth: కరాటే కల్యాణిపై శ్రీకాంత్‌ సంచలన ఆరోపణలు

May 13 2022 12:25 PM | Updated on May 13 2022 1:02 PM

Karate Kalyani Attack: Youtuber Srikanth Reddy Shares Video, Seeks Support - Sakshi

‘వచ్చి రాగానే సమాజం చెడిపోయే వీడియోలు చేస్తున్నావు అన్నారు. కల్యాణి నన్ను లక్ష రూపాయలు అడిగింది. ఇవ్వకపోతే పోలీసులకి కంప్లైంట్ చేస్తానని బెదిరించింది’

యూట్యూబర్‌ శ్రీకాంత్‌రెడ్డి, నటి కరాటే కల్యాణి మధ్య జరిగిన వాగ్వాదం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ప్రాంక్‌ వీడియోల పేరుతో మహిళలతో అసభ్య వీడియోలు చేస్తున్నారంటూ కరాటే కల్యాణి అతడిపై దాడి చేశారు. యూసుఫ్‌గూడలోని ఓ బస్తీ జరిగిన గొడవల ఒకరిపై ఒకరు పరస్పరం దాడి చేసుకున్నారు. దీంతో ఈ వివాదం మరింత ముదరింది. ఈ నేపథ్యంలో దీనిపై వివరణ ఇస్తూ శ్రీకాంత్‌ ఫేస్‌బుక్‌లో ఓ వీడియో వదిలాడు. ఈ సందర్భంగా అతడు కరాటే కల్యాణిపై సంచలన ఆరోపణలు చేశాడు.

చదవండి: యూట్యూబర్‌ శ్రీకాంత్‌రెడ్డిని చితక్కొట్టిన కరాటే కల్యాణి

ఈ వీడియోలో శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. ‘నా పేరు శ్రీకాంత్‌రెడ్డి. మీకు తెలుసు కదా నేను వీడియోలు చేస్తుంటాను. కరాటే కల్యాణితో జరిగిన గొడవ మీకు తెలిసిందే. నిన్న రాత్రి 9 గంటల మధ్య కరాటే కల్యాణి గారు మా ఇంటికి వచ్చారు. ఆమెతో పాటు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వచ్చి రాగానే సమాజం చెడిపోయే వీడియోలు చేస్తున్నావు అన్నారు. దీనికి నేను నువ్వు బాబీ అంటూ సినిమాలు చేస్తావు కదా? అలాంటప్పుడు నేను వీడియోలు చేసుకోవడంలో తప్పు ఏంటి? అని ప్రశ్నించాను’ అని అన్నాడు.

చదవండి: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ పెళ్లి డేట్‌ ఫిక్స్‌

ఆ తర్వాత ‘నా వీడియోల్లో చేసే ఆడవాళ్లు ఆర్టిస్టులు, వాళ్ళు డబ్బులు తీసుకొని చేస్తారని అని చెప్పాను. దీంతో కల్యాణి నన్ను లక్ష రూపాయలు అడిగింది. ఇవ్వకపోతే పోలీసులకి కంప్లైంట్ చేస్తానని బెదిరించింది. పక్కన ఉన్న అబ్బాయి గొడవ ఎందుకు 70 వేలకి సెట్ చేస్తాను అన్నాడు. నేను మీకు ఎందుకు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వను అనడంతో నాపై దాడి చేశారు, షర్ట్ చింపేసారు. కళ్యాణి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది. మీరంతా నాకు సపోర్ట్ ఇవ్వండి’ అంటూ చెప్పుకొచ్చాడు. చివరగా తాను ఏ తప్పు చేయలేదని, కేవలం వినోదం కోసమే వీడియోలు చేస్తుంటున్నానని శ్రీకాంత్‌ పేర్కొన్నాడు. అలాగే కరాటే కల్యాణిపై ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసుల స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశానన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement