పిల్లలకు ప్రేమతో...

బాలీవుడ్ దర్శక–నిర్మాత కరణ్ జోహార్ ఓ పుస్తకం రాస్తున్నారు. సినిమాలు ఎలా తీయాలి? కథలు ఎలా రాయాలి? అని కాదు. పిల్లల పుస్తకం రాస్తున్నారట. సరోగసీ ద్వారా అబ్బాయి యష్, అమ్మాయి రూహీలను పొందారు కరణ్. లాక్‌డౌన్ సమయంలో పిల్లలతో గడుపుతున్న వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకున్నారు కరణ్. తాజాగా పిల్లల కోసం ప్రేమతో ఓ పుస్తకం రాస్తున్నట్టు ప్రకటించారు. తన కవలలతో ఉన్నSఅనుబం«ధం, పిల్లల్ని పెంచడంలో మన ఆలోచనలు ఎలా ఉన్నాయి వంటి అంశాలు ఈ పుస్తకంలో ఉంటాయట. ‘ది బిగ్ థాట్స్ ఆఫ్ లిటిల్ లవ్’ అనే టైటిల్‌తో ఈ పుస్తకం త్వరలోనే మార్కెట్లోకి రానుంది. గతంలో ‘యాన్ అన్‌సూటబుల్ బాయ్’ పేరుతో కరణ్ జోహార్ ఓ ఆత్మకథను రాసుకున్న సంగతి తెలిసిందే.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి