రానున్న 'కాఫీ విత్‌ కరణ్' షో 7వ సీజన్‌.. టీజర్ రిలీజ్‌ | Sakshi
Sakshi News home page

Koffee With Karan: ఏడో సీజన్‌తో 'కాఫీ విత్‌ కరణ్' షో.. ఎప్పుడు? ఎక్కడంటే?

Published Sun, Jun 19 2022 4:23 PM

Karan Johar Announces Koffee With Karan Show 7 Season Teaser - Sakshi

Karan Johar Announces Koffee With Karan Show 7 Season Teaser: అన్ని భాషల్లో పాపులారిటీ సంపాదించుకున‍్న షోలలో కాఫీ విత్ కరణ్ ఒకటి. ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేసే ఈ షోలో సెలబ్రిటీలు వచ్చి తమ వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకుంటారు. ఈ షోకి బాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్‌ ఉంది. అయితే ఇటీవల ఈ షోను ఇక కొనసాగించనని కరణ్‌ జోహార్‌ ప్రకటించి అభిమానులను షాక్‌గు గురిచేశాడు. కానీ తాజాగా ఆదివారం (జూన్ 19) ఈ షో 7వ సీజన్‌ను టెలీకాస్ట్‌ చేస్తున్నట్లు ఓ వీడియో విడుదల చేసి ఆశ్చర్యపరిచాడు కరణ్ జోహార్. 

ఈ వీడియోలో రణ్‌బీర్‌ కపూర్, రణ్‌వీర్‌ సింగ్, సైఫ్ అలీ ఖానా, కరీనా కపూర్, ప్రియాంక చోప్రా, షారుక్ ఖాన్, ఐశ్వర్య రాయ్‌ తదితరులు ఉన్నారు. అలాగే ఈ టీజర్‌లో 'ఇప్పుడు రాబోయే సీజన్‌ మరింత పెద్దది, మెరుగైనది, ఇంకా మరింత అందమైనది' అని కరణ్ జోహార్‌ ఉత్సాహంగా చెప్పడం మనం చూడొచ్చు. కాపీ విత్ కరణ్‌ సీజన్ 7 ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో జులై 7 నుంచి ప్రసారం కానుంది. 

చదవండి: చెత్త ఏరిన స్టార్‌ హీరోయిన్‌.. వీడియో వైరల్‌
సాయి పల్లవి వివరణపై ప్రకాశ్‌ రాజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
థియేటర్‌లో అందరిముందే ఏడ్చేసిన సదా.. వీడియో వైరల్‌

Advertisement
 
Advertisement