
కన్నడ హిట్ సినిమా కాంతారలో నటుడు రిషబ్ శెట్టితో కలిసి నటించిన దున్నపోతు అప్పు కన్నుమూసింది. ఇది కరావళి భాగంలో అనేక కంబళ పోటీలలో పాల్గొని పతకాలను గెల్చుకుంది. బెంగళూరులో జరిగిన కంబళ పోటీలలో ప్రథమస్థానంలో నిలిచింది. కంబళ దున్నలను యజమానులు తమ కుటుంబసభ్యులుగా భావిస్తారు.
మంచి ఆహారంతో పాటు సకల వసతులుకల్పిస్తారు. దీని పేరు అప్పు కాగా, కాంతార సినిమా కోసం ఎంపిక చేసుకున్నారు. రిషబ్‌తో కలిసి అనేక సన్నివేశాలలో కనిపిస్తుంది. వయోభారంతో మరణించడంతో యజమానులు, అభిమానులు విషాదానికి లోనయ్యారు. శనివారం ఘనంగా అంత్యక్రియలు జరిపించారు.