దర్శకుని కుమారుడు దుర్మరణం    | Kannada Film Director Suryoday Perampalli Son Dies In Road Accident | Sakshi
Sakshi News home page

దర్శకుని కుమారుడు దుర్మరణం   

Jul 4 2021 9:24 AM | Updated on Jul 4 2021 9:24 AM

Kannada Film Director Suryoday Perampalli Son Dies In Road Accident - Sakshi

యశవంతపుర(కర్ణాటక) : ట్యాంకర్, బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన బ్యాడరహళ్లి పోలీసుస్టేషన్‌ పరిధిలో శుక్రవారం రాత్రి జరిగింది. మృతుడిని దర్శకుడు సూర్యోదయ కుమారుడు మయూర్‌ (20)గా గుర్తించారు. మయూర్‌ శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో బైక్‌లో ఇంటికి వెళ్తూ మార్గం మధ్యలో బ్యాడరహళ్లి న్యూ లింక్‌ రోడ్డు వద్ద వేగంగా వచ్చిన ట్యాంటర్‌ బైక్‌ను ఢీకొంది. దీంతో మయూర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. 

సూర్యోదయ పెరంపల్లి పలు కన్నడ, తులు చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించాడు. ఆయన దర్శకత్వ వహించిన ‘దేయి బైడేతి’చిత్రానికి మూడు రాష్ట్ర స్థాయి అవార్డులు లభించాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement