రెండో పెళ్లికి రెడీ అవుతున్న ప్ర‌ముఖ‌ స్క్రీన్ రైట‌ర్‌ | Kanika Dhillon, Writer Himanshu Sharma Gets Engaged | Sakshi
Sakshi News home page

స్క్రీన్ రైట‌ర్ల నిశ్చితార్థం

Dec 14 2020 9:01 PM | Updated on Dec 14 2020 9:01 PM

Kanika Dhillon, Writer Himanshu Sharma Gets Engaged - Sakshi

బాలీవుడ్ ప్ర‌ముఖ‌ స్క్రీన్ రైట‌ర్లు క‌నికా ధిల్లాన్‌, హిమాన్షు శ‌ర్మ గ‌త కొంత కాలంగా ప్రేమ‌లో మునిగి తేలుతున్న సంగ‌తి తెలిసిందే. వీళ్ళ మ‌ధ్య ఉన్న ప్రేమ‌ను రెట్టింపు చేసుకునేందుకు ఈ జంట వివాహ బంధంలోకి అడుగు పెట్ట‌బోతున్నారు. ఈ మేర‌కు ఇటీవ‌లే వీరి నిశ్చితార్థం కూడా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి కేవ‌లం ఇరు కుటుంబాల స‌భ్యులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. దీనికి సంబంధించిన ఫొటోల‌ను క‌నికా తాజాగా సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ త‌న ఆనందాన్ని అభిమానుల‌తో పంచుకున్నారు. 'జ‌డ్జిమెంట‌ల్ హై క్యా', 'మ‌న్మ‌ర్జియాన్' సినిమాల‌కు ర‌చ‌యిత‌గా ప‌ని చేసిన క‌నికాకు గ‌తంలో ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు కొడుకు ప్ర‌కాష్‌ కోవెల‌మూడితో వివాహం జ‌రిగింది. (చ‌ద‌వండి: హిమాంశు, నేనూ విడిపోయాం: స్వరభాస్కర్‌)

ప్ర‌కాష్‌ ద‌ర్శ‌కుడిగా ‘అనగనగా ఓ ధీరుడు’ అనే ఫాంటసీ మూవీ తీసి ఘోరంగా విఫలం అయ్యాడు. ఆ తరువాత ‘జీరో సైజ్’ కూడా అత‌నికి పెద్ద‌గా పేరు తీసుకురాలేదు. అయితే కొంత‌కాలానికి క‌నికా, ప్ర‌కాష్‌ విడిపోయారు. రియ‌ల్ లైఫ్‌లో విడిపోయినా రీల్ లైఫ్‌లో మాత్రం క‌లిసి ప‌ని చేసేవారు. అలా కంగ‌నా ర‌నౌత్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన‌ 'జ‌డ్జిమెంట‌ల్ హై క్యా' చిత్రానికి ప్ర‌కాష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించగా, క‌నికా క‌థ‌ను అందించారు. ఇక హిమాన్షు విష‌యానికి వ‌స్తే.. త‌ను 'వెడ్స్ మ‌ను', 'రాణీజానా', 'జీరో' చిత్రాల‌కు క‌థ అందించిన ఆయ‌న న‌టి స్వ‌ర‌భాస్క‌ర్‌తో కొంత కాలం ప్రేమాయ‌ణం న‌డిపారు. అయితే ఇద్ద‌రు దారులు వేర‌ని తెలుసుకుని ఆ బంధానికి ముగింపు ప‌లికారు. (చ‌ద‌వండి: మూడు పువ్వులు... ఆరు కాయలు)

Advertisement
 
Advertisement
Advertisement