హైదరాబాద్‌లో 10 రోజులపాటు కంగనా | Kangana Ranaut Came To Hyderabad For Movie Shooting In RFC | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ చేరుకున్న బాలీవుడ్ క్వీన్‌

Oct 2 2020 4:43 PM | Updated on Oct 2 2020 4:58 PM

Kangana Ranaut Came To Hyderabad For Movie Shooting In RFC - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ హైదరాబాద్‌కు చేరుకున్నారు. సినిమా షూటింగ్‌ కోసం నగరానికి వచ్చిన కంగనా 10 రోజులపాటు ఇక్కడే ఉండనున్నారు. రామోజీ ఫిలింసిటీలో జరిగే సినిమా షూటింగ్‌లో ఆమె పాల్గొననున్నారు. అయితే సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం అనంతరం సంచలన వ్యాఖ్యలు చేయడంతో కంగనాకు, మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె హైదరాబాద్‌ రాకను అధికారులు గోప్యంగా ఉంచారు. అదే విధంగా కంగనాకు వై కేటగిరి సెక్యూరిటీ ఉండటంతోపాటు తెలంగాణ పోలీసులు ఆమెకు పూర్తిస్తాయిలో భద్రత కల్పించనున్నారు. చదవండి: ఉద్ధవ్‌ ఠాక్రేపై భగ్గుమన్న బాలీవుడ్‌ క్వీన్‌

కాగా దాదాపు ఏడు నెలల తర్వాత సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు కంగనా పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ట్విటర్‌లో గురువారం పోస్టు చేశారు.  ‘‘ప్రియమైన మిత్రులారా, ఈ రోజు చాలా స్పెషల్.. దాదాపు ఏడు నెల‌ల త‌ర్వాత సినిమా షూటింగ్ ప‌నులను ప్రారంభిస్తున్నాను. నేను నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘తలైవి’ కోసం సౌత్ ఇండియా వెళ్తున్నాను.. ఈ కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో నాకు మీ ఆశీర్వాదం కావాలి’’. అంటూ కంగనా పేర్కొన్నారు. కోర్టు ముందుకు సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యలు

Advertisement
 
Advertisement
Advertisement