కమల్‌తో తలపడనున్న ‘పుష్ప’విలన్‌ | Kamal Haasan Upcoming Film Fahad Fazil To Play Villain | Sakshi
Sakshi News home page

కమల్‌తో తలపడనున్న ‘పుష్ప’విలన్

Apr 8 2021 4:50 PM | Updated on Apr 8 2021 5:51 PM

Kamal Haasan Upcoming Film Fahad Fazil To Play Villain - Sakshi

మలయాళ స్టార్‌ యాక్టర్‌ ఫాహద్‌ ఫాజిల్‌ వరుసగా విలన్‌ రోల్స్‌కు ఓకే చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ‘పుష్ప’ సినిమాలో విలన్‌గా నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు ఫాహద్‌. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. తాజాగా ‘ఖైదీ, మాస్టర్‌’ చిత్రాల ఫేమ్‌ లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌ నటిస్తున్న ‘విక్రమ్‌’ అనే తమిళ సినిమాకు ఓకే చెప్పారు. ఈ చిత్రంలో ఓ లీడ్‌ క్యారెక్టర్‌ చేయనున్నట్లు ఫాహద్‌ తెలిపారు. ఆయన చేస్తున్నది విలన్‌ పాత్ర అని చెన్నై సమాచారం. తమిళంలో ఫాహద్‌ చేస్తున్న మూడో చిత్రం ఇది. ఇంతకుముందు శివకార్తికేయన్‌ ‘వేలైక్కారన్‌ ’, విజయ్‌ సేతుపతి – సమంతల ‘సూపర్‌ డీలక్స్‌’ చిత్రాల్లో ఫాహద్‌ నటించారు.

Advertisement
 
Advertisement
Advertisement