థగ్‌ లైఫ్‌ ట్రైలర్‌ రెడీ | Kamal Haasan Thug Life Trailer to Release on May 17 | Sakshi
Sakshi News home page

థగ్‌ లైఫ్‌ ట్రైలర్‌ రెడీ

May 16 2025 3:40 AM | Updated on May 16 2025 3:40 AM

Kamal Haasan Thug Life Trailer to Release on May 17

హీరో కమల్‌హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లో రూపొందిన తాజా చిత్రం ‘థగ్‌ లైఫ్‌’. ఈ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా చిత్రంలో శింబు, త్రిషా కృష్ణన్, ఐశ్వర్యా లక్ష్మీ, జోజూ జార్జ్‌ ఇతర కీలక పాత్రల్లో నటించారు. కమల్‌హాసన్, ఆర్‌. మహేంద్రన్, మణిరత్నం, శివ అన్నాత్తే, ఉదయనిధి స్టాలిన్‌ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం జూన్‌ 5న విడుదల కానుంది. కమల్‌హాసన్‌ ‘విక్రమ్‌’, శివ కార్తికేయన్‌ ‘అమరన్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన ఎన్‌. సుధాకర్‌రెడ్డి, ఈ ‘థగ్‌ లైఫ్‌’ సినిమాను  శ్రేష్ఠ్‌ మూవీస్‌ బ్యానర్‌పై తెలుగులో విడుదల చేస్తున్నారు.

కాగా ఈ సినిమా ప్రమోషనల్‌ ప్లాన్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఈ నెల 17న ట్రైలర్‌ను ఆన్‌లైన్‌లో రిలీజ్‌ చేయనున్నారు. అలాగే ఈ నెల 24న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ఆడియో లాంచ్, 29న విశాఖపట్నంలో తెలుగు వెర్షన్‌ ప్రీ–రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లుగా మేకర్స్‌ అధికారికంగా వెల్లడించారు. ఈ రెండు ప్రమోషనల్‌ ఈవెంట్స్‌కు ముందు చెన్నైలోని సాయిరామ్‌ కాలేజీలో ఈ చిత్రం సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ లైవ్‌ పెర్ఫార్మెన్స్‌తో, ‘థగ్‌ లైఫ్‌’ ఆడియో లాంచ్‌ ఈవెంట్‌ జరపనున్నట్లు మేకర్స్‌ తెలిపారు.

అలాగే పాన్‌ ఇండియా స్థాయిలో ‘థగ్‌ లైఫ్‌’ సినిమా ప్రమోషన్స్‌ను నిర్వహించనున్నట్లుగా మేకర్స్‌ వెల్లడించారు. ఇదిలా ఉంటే... ‘నాయగన్‌’ (తెలుగులో ‘నాయకుడు’) వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత హీరో కమల్‌హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లో దాదాపు 38 సంవత్సరాల తర్వాత రానున్న ‘థగ్‌ లైఫ్‌’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.   

Advertisement
 
Advertisement
Advertisement