వేసవి కాలం.. పాట విన్నారా? | Kalyanamastu Movie: Vesavi Kaalam Song Released | Sakshi
Sakshi News home page

Kalyanamastu: కళ్యాణమస్తు నుంచి వేసవి కాలం.. పాట విన్నారా?

Apr 23 2023 6:42 PM | Updated on Apr 23 2023 6:42 PM

Kalyanamastu Movie: Vesavi Kaalam Song Released - Sakshi

శేఖర్ అయాన్ వర్మ, వైభవి రావ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం కళ్యాణమస్తు. సాయి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి కొత్త అప్‌డేట్‌ వచ్చింది. ఆదివారం కళ్యాణమస్తు చిత్రం నుంచి వేసవి కాలం అనే పాటను రిలీజ్ చేసింది చిత్రబృందం. అలరాజు లిరిక్స్ అందించిన ఈ పాటను యాజిన్ నజీర్, అదితి భావరాజు ఆలపించారు.

"నీ జాతలో నీడల్లే ఉండనా కడదాకా.. కన్నీరు అన్నదే రానీక.. యేం మాయనో నడిపింది నన్నిలా నీదాక.. అడుగైన దూరమే  కానింకా" అంటూ సాగే చరణాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాను బోయపాటి రఘుబాబు నిర్మించారు. ఆర్‌ఆర్‌ ధ్రువన్ సంగీతం అందించిన ఈ సినిమాకు మల్లికార్జున్ నరగాని సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రం మే 12న విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement