డెవిల్‌ కోసం కళ్యాణ్‌రామ్‌ ఎన్ని కాస్ట్యూమ్స్‌ మార్చాడో తెలుసా? | Sakshi
Sakshi News home page

స్టైలిష్‌ గూఢచారి.. హీరోను ప్రత్యేకంగా చూపించేందుకు అంత కష్టపడ్డారా?

Published Mon, Dec 11 2023 3:35 AM

Kalyan Ram Devil grand release on December 29th - Sakshi

కల్యాణ్‌ రామ్‌ టైటిల్‌ రోల్‌లో రూపొందిన తాజా చిత్రం ‘డెవిల్‌’. అభిషేక్‌ పిక్చర్స్‌పై అభిషేక్‌ నామా స్వీయ దర్శకత్వంలో రూ΄పొందించిన చిత్రం ఇది. ఈ నెల 29న ఈ పీరియాడికల్‌ డ్రామాని విడుదల చేయనున్నారు. బ్రిటిష్‌వారు భారతదేశాన్ని పరిపాలించిన కాలానికి సంబంధించిన కథ ఇది. ఈ చిత్రంలో కల్యాణ్‌ రామ్‌ భారతీయుడు అయినప్పటికీ బ్రిటిష్‌ గూఢచారి డెవిల్‌ పాత్రలో కనిపించనున్నారు.

భారతీయత ఉట్టిపడటంతో పాటు స్టైలిష్‌ గూఢచారిగా చూపించేందుకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌ రాజేశ్‌తో 90 కాస్ట్యూమ్స్‌ తయారు చేయించారు అభిషేక్‌ నామా. ఈ దుస్తుల గురించి కాస్ట్యూమ్‌ డిజైనర్‌ రాజేశ్‌ మాట్లాడుతూ– ‘‘హీరో లుక్‌ కొత్తగా ఉండేలా ట్రై చేశాం. ధోతి, పైన ఒక వెయిస్ట్‌ కోటుతో ఆయన కాస్ట్యూమ్స్‌లో భారతీయత కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇటలీ నుంచి తెప్పించిన మోహైర్‌ ఊల్‌తో 60 బ్లేజర్స్, దేశీ కాటన్‌తో కుర్తాలు, ధోతీలు తయారు చేశాం. 25 వెయిస్ట్‌ కోట్స్‌ కుట్టాం. బ్లేజర్‌ జేబు పక్కన వేలాడుతూ ఉండేలా ఓ హ్యాంగింగ్‌ వాచ్‌ను ప్రత్యేకంగా తయారు చేయించాం’’ అన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement