జ్యోతిక విడాకుల రూమర్స్.. ముంబైకి షిఫ్ట్.. అసలు కారణం ఇదేనా? | Jyothika Focus On Bollywood, Amid Divorce Rumours Why She Shifted To Mumbai? Deets Inside- Sakshi
Sakshi News home page

Jyothika-Suriya Divorce Rumours: విడాకులు అనుకున్నారు.. ఇన్నాళ్లకు అసలు మేటర్ రివీల్?

Published Tue, Jan 23 2024 4:13 PM

Jyothika Focus On Bollywood And Divorce Rumours - Sakshi

సూర్య-జ్యోతిక.. ఈ జంట బాండింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా చేస్తున్న టైంలో ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకున్నారు. వీళ్ల బంధానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ప్రస్తుతం హీరోగా సూర్య చాలామంచి పేరు తెచ్చుకున్నాడు. జ్యోతిక కూడా నటిగా రీఎంట్రీ ఇచ్చింది. అలాంటిది కొన్నిరోజుల క్రితం వీళ్లు విడాకులు తీసుకోబోతున్నారనే రూమర్స్ వచ్చాయి. ఇ‍ప్పుడు దీనిలో ఓ కొత్త విషయం బయటపడింది.

(ఇదీ చదవండి: అత్తారింట్లో కండీషన్స్? మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్)

ముంబయిలో పుట్టిపెరిగిన జ్యోతిక.. సూర్యని పెళ్లి చేసుకున్న తర్వాత తమిళనాడులో సెటిలైపోయింది. తాజాగా పిల్లల్ని తీసుకుని ముంబైకి షిఫ్ట్ అయిపోవడంతో విడాకుల రూమర్స్ వచ్చాయి. అయితే పిల్లల చదువు, తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవడం కోసమే జ్యోతిక.. సొంతింటికి వచ్చేసినట్లు టాక్ వినిపించింది. ఇవి కాకుండా మరో విషయం కూడా ఇప్పుడు అందరికీ తెలిసింది.

పెళ్లి తర్వాత యాక్టింగ్ పక్కనబెట్టిన జ్యోతిక... పిల్లలు కాస్త పెద్దోళ్లు అయిన తర్వాత '36 వయదినిలే' సినిమాతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. దాదాపు ఆరేళ్లు తమిళ చిత్రాలే చేసింది. ఈ మధ్యే మలయాళంలో 'కాథల్'తో హిట్ కొట్టింది. ప్రస్తుతం ఈమె మూడు హిందీ సినిమాలు చేస్తోంది. ఇప్పటివరకు సౌత్ సినిమాలు చేసిన జ్యోతిక.. బాలీవుడ్‌పై ఫోకస్ చేసేందుకే ముంబయి షిఫ్ట్ అయిందట. అంతే తప్ప విడాకులు కారణం కాదనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట. 

(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న 'బిగ్‌బాస్' శోభాశెట్టి)

Advertisement
 
Advertisement
 
Advertisement