జంగిల్‌లో ఏం జరిగింది? | Jungle Movie First Look Launch | Sakshi
Sakshi News home page

జంగిల్‌లో ఏం జరిగింది?

Nov 17 2020 6:15 AM | Updated on Nov 17 2020 6:15 AM

Jungle Movie First Look Launch - Sakshi

‘ఇప్పటివరకూ ఎన్నో హారర్‌ చిత్రాలు చూసి ఉంటారు. ఇప్పుడు సరికొత్త హారర్‌ చిత్రం తీసుకొస్తున్నాం’ అంటోంది ‘జంగిల్‌’ చిత్రబృందం. ఆది, వేదిక హీరోహీరోయిన్లుగా కార్తీక్‌ విఘ్నేష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్‌ చిత్రం ‘జంగిల్‌’. ‘అది శ్వాసిస్తుంది. అది దాక్కొని ఉంటుంది. అది వేటాడుతుంది’ అన్నది క్యాప్షన్‌. మహేశ్‌ గోవిందరాజ్, అర్చనా చందా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘మా సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే టీజర్‌ను విడుదల చేస్తాం. అలాగే రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తాం. కార్తీక్‌ విఘ్నేష్‌ దర్శకత్వ ప్రతిభ, కెమెరా, నేపథ్య సంగీతం మా సినిమాకు ప్రత్యేక ఆకర్షణ’’ అన్నారు. ఈ సినిమాకు లైన్‌ ప్రొడ్యూసర్స్‌: ఎస్‌ సత్యమూర్తి, సురేశ్‌ కుమార్, కెమెరా: గౌతమ్‌ జార్జ్, సంగీతం: జోస్‌ ప్రాంక్లిన్‌.

Advertisement
 
Advertisement
Advertisement