ఎన్టీఆర్‌ చొరవ, ఫ్యాన్స్‌ ఫిదా! | Jr NTR interacts with ailing fan over video call, promises to meet him soon | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ చొరవ, ఫ్యాన్స్‌ ఫిదా!

Nov 3 2020 5:53 PM | Updated on Nov 3 2020 8:07 PM

Jr NTR interacts with ailing fan over video call, promises to meet him soon - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్‌ఆర్‌ఆర్‌  చిత్రం షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తన అభిమాని కోసం పెద్ద మనసు చేసుకున్నారు. గతం కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న తన ఫ్యాన్‌ను పలకరించి అతనికి భారీ ఓదార్పునిచ్చారు.  దీంతో యంగ్‌ టైగర్‌ చూపించిన మానవత్వం, అభిమానంపై  ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మస్క్యులర్‌ డిస్ట్రోఫీతో బాధపడుతున్న తన అభిమాని వెంకన్న అనారోగ్యం గురించి తెలుసుకున్నారు.  తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమైపోయిన తన వీరాభిమాని దీనావస్థ గురించి విని చలించిపోయారు. వీడియో కాల్‌ ద్వారా ఎన్టీఆర్‌ వెంకన్నను పలకరించారు. దీంతో ఆశ్చర్యపోవడం అతని వంతైంది. ఎన్టీఆర్‌తో సెల్ఫీ తీసుకోవాలని ఉందనే కోరికను వ్యక్తం చేశాడు. అతని మాటలను ఓపికగా విన్న ఎన్టీఆర్‌ పరిస్థితులన్నీ చక్కబడిన వెంటనే అతడిని కలవడానికి వస్తానని అప్పుడు తనతో సెల్ఫీ తీసుకుంటానని హామీ ఇచ్చారు. అంతేకాదు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. తరువాత  వెంకన్న తల్లితో కూడా మాట్లాడి జూనియర్ ఎన్టీఆర్ ఆందోళన చెందవద్దంటూ ధైర్యం చెప్పారు. దీనికి సంబంధించిన వీడియ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement