ఈమె స్టార్ హీరోయిన్, ఆ ఒక్క సినిమాతో చాలా ఫేమస్.. కానీ ఆ తర్వాతే! | Sakshi
Sakshi News home page

Guess The Actress: మహేశ్, త్రివిక్రమ్ సినిమాల్లో చేసినా ఈమెకి కలిసిరాలేదు.. దీంతో!

Published Sat, Jan 20 2024 9:26 PM

 Journey Movie Actress Ananya Career And Family Details - Sakshi

ఈమెని చూస్తే అచ్చ తెలుగమ్మాయి అనుకుంటారు. కానీ ఈమెది తెలుగు కాదు. సొంత భాషలో కెరీర్ సంగతి పర్లేదు కానీ తెలుగులో మాత్రం ఒకే ఒక్క సినిమాతో యమ క్రేజ్ సంపాదించింది. ఆ తర్వాత మాత్రం టాలీవుడ్‌లో సరిగా కెరీర్ ప్లాన్ చేసుకోలేకపోయింది. భారీ బడ్జెట్ సినిమాల్లో నటించినా లాభం లేకుండా పోయింది. మరి ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?

పైన కనిపిస్తున్న బ్యూటీ పేరు అనన్య. అరె.. ఈమెని ఎక్కడో చూసినట్లు ఉందే అనుకుంటున్నారా? పర్లేదు కాస్త గుర్తుపట్టారనమాట. కేరళలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ అసలు పేరు అయిల్య గోపాలకృష్ణ. కాకపోతే సినిమాల్లోకి వచ్చేసరికి అనన్య అని పేరు మార్చుకుంది. తండ్రి నిర్మాత కావడంతో చిన్నప్పుడే ఒకటి రెండు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది. ఆ తర్వాత మళ్లీ ఇటువైపు కన్నెత్తి చూడలేదు. 

(ఇదీ చదవండి: ఓటీటీలో తెలుగు ప్రేక్షకుల్ని ఏడిపించేస్తున్న సినిమా.. మీరు చూశారా?)

ఇక డిగ్రీ చదువుతున్నప్పుడు ఆర్చరీలో(విలువిద్య) రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అదే టైంలో ఈమెకు మూడు నాలుగు సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. కానీ వాటికి నో చెప్పింది. కానీ కొన్నిరోజుల తర్వాత 'పాజిటివ్' అనే చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 2008 నుంచి ఇప్పటికీ సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ.. 'జర్నీ' సినిమాతో తెలుగు ఆడియెన్స్‌కి దగ్గరైపోయింది. ఆ తర్వాత హీరోయిన్‌గా తెలుగులో 'అమాయకుడు' అని స్ట్రెయిట్ మూవీ చేసింది. కానీ ప్లాఫ్ అయింది.

గత కొన్నాళ్లలో అయితే 'అఆ', 'మహర్షి' లాంటి తెలుగు సినిమాల్లో చిన్నాచితకా పాత్రలు చేసింది కానీ టాలీవుడ్‌లో ఇదేమంతగా ఉపయోగపడలేదు. దీంతో పూర్తిగా మలయాళ చిత్రాలకే పరిమితమైపోయింది. నటిగా కొనసాగుతూనే 2012లో ఆంజనేయన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతానికైతే ఓవైపు ఫ్యామిలీ, మరోవైపు యాక్టింగ్ కెరీర్ బ్యాలెన్స్ చేసుకుంటోంది. అయితే చాలారోజుల తర్వాత ఈమెని చూసి నెటిజన్స్ గుర్తుపట్టలేకపోయారు. కాసేపటి తర్వాత ఈమె 'జర్నీ' హీరోయిన్ కదా అని గుర్తుపట్టారు.

(ఇదీ చదవండి: రష్మికతో ఎంగేజ్‌మెంట్‌పై క్లారిటీ ఇచ్చేసిన విజయ్ దేవరకొండ)

Advertisement
 
Advertisement