తండ్రి కాబోతున్న రాకింగ్‌ రాకేశ్‌? ఫోటో వైరల్‌! | Rocking Rakesh Wife Jordar Sujatha Seemantham Photo Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Jordar Sujatha Pregnant News: జోర్దార్‌ సుజాత సీమంతం? ఫోటో వైరల్‌

Apr 6 2024 4:49 PM | Updated on Apr 6 2024 5:36 PM

Jordar Sujatha Seemantham Photo Goes Viral - Sakshi

ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్‌ ఉంటుంది. అదే వారికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెడుతుంది. అలా సుజాత.. తన మాటల ప్రవాహంతో ఫేమస్‌ అయింది. అచ్చ తెలంగాణ యాసలో గలగలా మాట్లాడుతూ జోర్దార్‌ సుజాతగా పేరు సంపాదించుకుంది. మొదట్లో టీవీ ఛానల్‌లో వార్తలు చదివింది. తర్వాత బిగ్‌బాస్‌ షోలో ఎంట్రీ ఇచ్చింది. టీవీ షోలతో బిజీ అయింది. జబర్దస్త్‌ కమెడియన్‌ రాకింగ్‌ రాకేశ్‌ను పెళ్లి చేసుకుంది. సేవ్‌ ది టైగర్స్‌ వెబ్‌ సిరీస్‌తో నటిగా మారింది. 

తాజాగా ఆమె సీమంతం జరి​గిందంటూ ఓ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో సుజాత.. పర్పుల్‌ కలర్‌ సారీలో నిండా నగలు ధరించి ఎంతో చూడముచ్చటగా ఉంది. ఈ ఫోటోను గెటప్‌ శ్రీను భార్య సుజాత ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పంచుకుంటూ హ్యాపీ ఫర్‌ యూ.. కంగ్రాచ్యులేషన్స్‌ అని రాసుకొచ్చింది. 

అయితే సుజాత.. తను ప్రెగ్నెంట్‌ అన్న విషయాన్ని ఇంతవరకు చెప్పనేలేదు. కానీ కొంతకాలంగా ఆమె ఏ వీడియో షేర్‌ చేసినా జనాలు దాని కింద మీరు ప్రెగ్నెంట్‌ కదా.. అని కామెంట్స్‌ చేస్తూ వచ్చారు. ఇప్పుడిలా సీమంతం చేసుకున్నట్లుగా ఫోటో బయటకు రావడంతో సుజాత ప్రెగ్నెన్సీ నిజమేనంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

చదవండి: వంద కోట్లకు చేరువలో క్రూ.. అంత స్పెషల్‌ ఏముందబ్బా?

Advertisement
 
Advertisement
Advertisement