ఒక్క నిమిషం వీడియో.. ఆస్కార్‌ ఆవకాశం

JFLIX Film Festival To Celebrate Short Video Content Josh Announces Today - Sakshi

జోష్‌ యాప్‌ ‘జేఎఫ్‌ఎల్‌ఐఎక్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’...

ఉత్తమ చిత్రాన్ని ఎంపిక చేయనున్న ఫరాఖాన్, ప్రభుదేవా

12న గోవాలో గ్రాండ్‌ ఫినాలే...

సాక్షి,సిటీబ్యూరో: సినిమానే జీవితాశయంగా మార్చుకుని, సినిమా రంగంలో అవకాశాల కోసం వినూత్న శైలిలో షార్ట్‌ఫిల్మ్‌లు రూపొందిస్తున్న నేటి తరం సినిమా ప్రేమికులు ఎందరో... కానీ అలాంటి ఔత్సాహికుల కళను, ఆసక్తిని ప్రదర్శించే వేదిక ఇప్పటి వరకు లేదు. అలాంటి వారి కోసమే దేశంలో మొట్టమొదటిసారిగా అంతర్జాల వేదికగా ప్రఖ్యాతిగాంచిన జోష్‌ యాప్‌ ‘జేఎఫ్‌ఎల్‌ఐఎక్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ పేరుతో ఓ వేదికను రూపొందించింది. ఈ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రంగా ఎంపికైన షార్ట్‌ ఫిల్మ్‌ ఏకంగా ఆస్కార్‌ సెలబ్రేషన్స్‌లో పాల్గొనడమేకాకుండా అక్కడి సెలబ్రిటీ స్క్రీనింగ్‌లో భాగం కానుంది. 
(చదవండి: భర్త మరో మహిళతో జిమ్‌లో ఉండగా రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకున్న భార్య)

చిన్న సినిమా.. పెద్ద వేదిక...
ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో భాగంగా కేవలం ఒకే ఒక్క నిమిషం నిడివి గల షార్ట్‌ ఫిల్మ్‌ రూపొందించాలి. దేశ వ్యాప్తంగా స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని నిర్వాహాకులు తెలిపారు. రోమ్‌కామ్, మ్యూజికల్, కామెడీ, యాక్షన్, ఫ్యాషన్‌ మరేదైనా కథాంశంతో షార్ట్‌ ఫిల్మ్‌ రూపొందించి, నవంబర్‌ 1వ తేదీలోపు జోష్‌ యాప్‌లో సబ్మిట్‌ చేయాలని పేర్కొన్నారు. 

ఈ ఎంట్రీలలోని ఉత్తమమైన షార్ట్‌ ఫిల్మ్‌ను ఎంపిక చేయడానికి న్యాయనిర్ణేతలుగా ప్రముఖ తారలు ఫరాఖాన్, కునాల్‌ కోహ్లీ, ప్రభుదేవాలు వ్యవ్హరిస్తున్నారు. నవంబర్‌ 12న గోవాలో జరిగే గ్రాండ్‌ ఫినాలేలో బెస్ట్‌ షార్ట్‌ ఫిల్మ్‌ను ప్రకటించనున్నారు. ఈ గ్రాండ్‌ ఫినాలేలో ప్రముఖ తారలు వివేక్‌ ఒబేరాయ్, ఉర్వశి రౌతేల హోస్ట్‌గా..,  సునీల్‌ శెట్టి, అలయా ఎఫ్, డినో మోరియా, సోనియా మెహరా, సోనాలి రౌత్‌ తదితరులు అతిథులుగా విచ్చేయనున్నారు. 

‘జేఎఫ్‌ఎల్‌ఐఎక్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో ఉత్తమ చిత్రంగా ఎంపికైన షార్ట్‌ ఫిల్మ్‌ హాలీవుడ్‌ ఆస్కార్‌ సెలబ్రేషన్స్‌కు వెలుతుందని, అక్కడ జరిగే సెలబ్రిటీ స్క్రీనింగ్‌లో భాగమవుతుందని ఫిల్మ్‌ ఫెస్టివల్‌ నిర్వాహాకులు తెలిపారు. 
(చదవండి: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌!)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top