భర్త మరో మహిళతో జిమ్‌లో ఉండగా రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకున్న భార్య

Viral: Woman Thrashes Husband Alleged Girlfriend In Gym In Bhopal - Sakshi

తన భర్త మరో మహిళతో జిమ్‌లో ఉండగా భార్య రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకుంది. సదరు మహిళతో భర్త ఎఫైర్‌ కొనసాగిస్తున్నాడన్న అనుమానంతో భార్య ఆమెను చితకబాదింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. అక్టోబర్‌ 15న జరిగిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. వివరాలు.. భోపాల్‌లోని కోహో ఇ ఫిజా ప్రాంతంలో నివసిస్తున్న మహిళ తన భర్త మరొకరితో సంబంధం పెట్టుకున్నాడని అనుమానం పెంచుకుంది. అప్పటి నుంచి భర్త కదలికలపై ఓ కన్నేసి పెట్టింది. ఇదే క్రమంలో తన సోదరితో కలిసి జిమ్‌కు వెళ్లింది.
చదవండి: వైరల్‌: పెళ్లిలో వధువు సర్‌ప్రైజ్‌ డ్యాన్స్‌.. ఎమోషనల్‌ అయిన వరుడు

అదే జిమ్‌లో భర్త తన గర్ల్‌ఫ్రెండ్‌గా అనుమానిస్తున్న మరో మహిళతో వర్కౌట్స్‌ చేస్తూ కనిపించింది. దీంతో తన భర్త ఆమెతో రిలేషన్‌లో ఉన్నాడని భావించి మహిళను చెప్పులతో కొట్టడం ప్రారంభించింది. అంతటితో ఆగకుండా ఆవేశంతో ఊగిపోయి జుట్టు పట్టుకొని లాగేసింది. మధ్యలో జోక్యం చేసుకోవడానికి వచ్చిన భర్తపై సైతం విరుచుకుపడింది. ఈ గొడవను అక్కడున్న వారు ఆపడానికి ప్రయత్నించినా వీలు పడలేదు. దాదాపు పది నిమిషాలపాటు జిమ్‌లో రచ్చ రచ్చ చేశారు. అనంతరం మహిళ, ఆమె భర్త ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోగా భోపాల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే భార్య ఆరోపణలను భర్త ఖండించాడు. గర్ల్‌ఫ్రెండ్‌ అని చెబుతున్న అమ్మాయి అసలు ఎవరో కూడా తనకు తెలియదని అన్నారు. 
చదవండి: ‘వ్యాక్సిన్‌ వద్దంటే వద్దు.. వెళ్లకపోతే పాముతో కరిపిస్తా’

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top