రూట్ మార్చిన స్టార్ హీరో.. అలాంటి మూవీలో | Jayam Ravi's 'Brother' Movie First Look Revealed | Sakshi
Sakshi News home page

Jayam Ravi: రూట్ మార్చిన స్టార్ హీరో.. అలాంటి మూవీలో

Sep 20 2023 4:23 PM | Updated on Oct 28 2023 1:33 PM

Jayam Ravi Brother MOvie First Look - Sakshi

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న నటుడు జయం రవి. ఈయన నయనతారతో కలిసి నటించిన 'ఇరైవన్‌' చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. మరోపక్క 'సైరన్‌' మూవీ షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఇందులో కీర్తి సురేశ్ హీరోయిన్. తాజాగా జయం రవి 30వ సినిమా టైటిల్‌ని వినాయక చవితి సందర్భంగా విడుదల చేశారు. 

ఈ చిత్రానికి 'బ్రదర్‌' అనే టైటిల్‌ నిర్ణయించారు. ఇందులో ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎం.రాజేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నటరాజన్‌, భూమిక, శరణ్య, గణేష్‌, రావు రమేష్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హరీశ్ జయరాజ్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. 

అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా యాక్షన్ సినిమాలు చేస్తున్న జయం రవి.. ఇప్పుడు రూట్ మార్తి కుటుంబ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నటిస్తున్నాడు. చైన్నె, హైదరాబాద్‌, ఊటీ, కొడైక్కెనాల్‌ ప్రాంతాల్లో షూటింగ్‌ చేస్తామని దర్శకుడు చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: ఒక్క ఫైట్‌ సీన్.. ఆ హీరో జీవితాన్నే ముగించింది!)

Advertisement
 
Advertisement
Advertisement