Jaya Bachchan Tests Positive For Covid-19, Under Home Isolation Details Inside - Sakshi
Sakshi News home page

Jaya Bachchan : ఈసారి కోవిడ్‌ నుంచి తప్పించుకోలేకపోయిన జయా బచ్చన్‌..

Feb 5 2022 3:38 PM | Updated on Feb 5 2022 4:09 PM

Jaya Bachchan Tests Positive For Covid-19,Under Home Isolation - Sakshi

Jaya Bachchan Tests Positive For Covid-19: బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్‌ సతీమణి, ప్రముఖ నటి జయా బచ్చన్‌ కోవిడ్‌ బారిన పడ్డారు. గతేడాది అమితాబ్‌, అభిషేక్‌లతో పాటు ఐశ్వర్య, ఆరాధ్యలు అందరూ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కానీ అదృష్టవశాత్తూ జయాబచ్చన్‌ మాత్రం తప్పించుకోగలిగారు. అయితే తాజాగా జరిపిన కోవిడ్‌ పరీక్షల్లో మాత్రం ఆమెకు కరోనా పాజిటివ్‌ అని నిర్థారణ అయ్యింది.

ఈ విషయాన్ని స్వయంగా బీఎంసీ అధికారి దృవీకరించారు.ప్రస్తుతం ఆమె ఇంట్లోనే హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. కాగా ప్రస్తుతం జయా బచ్చన్‌కు కరోనా అని తెలియగానే ఆమె  నటిస్తున్న ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’చిత్రం షూటింగ్‌ను ఆపేశారు.

కరణ్‌ జోహార్‌ తెరకెక్కిస్తున్న  ఈ సినిమాలో రణ్‌వీర్‌ సింగ్‌, ఆలియా భట్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా ప్రీతిజింటా, ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా ఆజ్మీ వంటి హేమాహేమీలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలె షబానా ఆజ్మీ సైతం కరోనా బారిన పడ్డారు. తాజాగా జయా బచ్చన్‌కి కూడా కోవిడ్‌ సోకడంతో షూటింగ్‌ నిలిచిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement