చిన్నతనంలో చేదు అనుభవాలు.. అబ్బాయిల్ని నమ్మాలంటేనే భయం! | Jamie Lever Says She was Traumatised as a 10 Year Old by Inappropriate Men | Sakshi
Sakshi News home page

బస్‌ కండక్టర్‌ అసభ్యంగా తాకేవాడు.. ఇవన్నీ చూశాక..: 'ఆ ఒక్కటీ అడక్కు' నటి

Jun 8 2025 10:30 AM | Updated on Jun 9 2025 10:10 AM

Jamie Lever Says She was Traumatised as a 10 Year Old by Inappropriate Men

పాపులర్‌ కమెడియన్‌ జానీ లివర్‌ (Johny Lever) కూతురు జామీ లివర్‌ (Jamie Lever) హిందీలో అనేక సినిమాలు చేసింది. గతేడాది ఆ ఒక్కటి అడక్కు చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఆమె తన బాల్యంలో ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకుంది. నాకు పదేళ్లుంటాయనుకుంటా. స్కూల్‌ అయిపోగానే వెళ్లి కారులో కూర్చున్నాను. మా డ్రైవర్‌ నా సోదరుడు జెస్సీ కోసం బయట ఎదురుచూస్తున్నాడు. ఇంతలో ఓ వ్యక్తి మా కారు దగ్గరకు వచ్చి నన్ను చూస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. కారు డోర్‌ తీసి లోపలకు వస్తే నా పరిస్థితి ఏంటని భయంతో వణికిపోయాను.

మమ్మల్ని కాపాడాల్సిన వ్యక్తే..
డోర్‌ లాక్‌ చేసి తనను చూడనట్లే ఉన్నాను. దాంతో అతడు కాసేపటికి వెళ్లిపోయాడు. బస్‌ కండక్టర్‌ కూడా మాతో పద్ధతిగా ప్రవర్తించేవాడు కాదు. ఎప్పుడూ ఏదో ఒకరకంగా తాకాలని చూసేవాడు. ఇదంతా ఒక పీడకలలా మర్చిపోవాలనుకునేదాన్ని. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన వ్యక్తే ఇలా నీచంగా ఆలోచిస్తే ఏమనాలి? ఇవన్నీ చూశాక అబ్బాయిలను నా జీవితంలోకి ఆహ్వానించాలంటేనే భయమేసింది. 20'sలో కేవలం ఒక్కరిని మాత్రమే డేటింగ్‌ చేశాను. నాకు జరిగిన అనుభవాలను అమ్మ సుజాతకు, నాన్న జానీ లివర్‌కు కూడా చెప్పుకోలేదు అని తెలిపింది.

చదవండి: పవన్‌ కల్యాణ్‌ సినిమాను ఎందుకు ఆపుతారు?: సునీల్‌ నారంగ్‌

Advertisement
 
Advertisement
Advertisement