ఆ హీరో కోసం హైదరాబాద్‌ రానున్న 'జేమ్స్ కామెరాన్'

James Cameron Came To Tollywood - Sakshi

మహేశ్‌బాబు-  రాజమౌళి కాంబోలో రానున్న బిగ్‌ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే పలు వార్తలు సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతూనే ఉన్నాయి. SSMB29 పేరుతో ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తవగా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ నడుస్తోంది. ఈక్రమంలో సినిమాకు సంబంధించి పలు వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉన్నాయి. తాజాగా మరోక వార్త వైరల్‌ అవుతుంది.

ఇండియాలోనే క్రేజీ ప్రాజెక్ట్‌గా రానున్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాలీవుడ్‌ టాప్ డైరెక్టర్ 'జేమ్స్ కామెరాన్' రాబోతున్నారని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తుంది. రాజమౌళి సినిమా ప్రమోషన్స్‌ చాలా విభిన్నంగా ఉంటాయి. అందుకు తగినట్లే ఆయన ప్లాన్‌ చేస్తారు. ఈ క్రమంలోనే 'జేమ్స్ కామెరాన్' తీసుకురావాలని జక్కన్న ప్లాన్‌లో ఉన్నారట. అంతేకాకుండా ఆ సమయంలో నేషనల్‌ లెవల్‌లో ప్రెస్‌మీట్‌ ఉండేలా స్కెచ్‌ వేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు, జాతీయ మీడియాకు కూడా ఈ ప్రాజెక్ట్‌ విషయాలు ఒకేసారి చెప్పేస్తే ఎలా ఉంటుందా?అని ఆలోచిస్తున్నారట.

ఈ క్రమంలో SSMB29  ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  డైరెక్టర్ 'జేమ్స్ కామెరాన్'ను రప్పించాలని జక్కన్నకు ప్లాన్‌ ఉందట. ఆర్ఆర్ఆర్ సినిమా చూసి జేమ్స్ కామెరాన్.. రాజమౌళి టాలెంట్‌కు ఫిదా అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే  పలు అంతర్జాతీయ వేదికలపై మన జక్కన్న గురించి ఆయన ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాను కొనియాడుతూ ఒక వీడియోను కూడా ఆయన విడుదల చేశారు. ఇంతలా వారిద్దరి మధ్య బాండింగ్‌ ఉంది కాబట్టే ఈ వార్తలు వైరల్‌ అవుతున్నాయి.

whatsapp channel

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top