భోళా శంకర్‌ ఓటీటీ డేట్‌ వచ్చేసింది.. అప్పటి నుంచే స్ట్రీమింగ్‌ | Sakshi
Sakshi News home page

Bhola Shankar Movie: ఓటీటీలో భోళా శంకర్‌.. ఐదు భాషల్లో ఈ వారమే స్ట్రీమింగ్‌..

Published Sun, Sep 10 2023 11:45 AM

Its Official: Bhola Shankar Movie OTT Date Out - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం భోళా శంకర్‌. కోలీవుడ్‌ స్టార్‌ అజిత్‌ వేదాళం సినిమాకు ఇది రీమేక్‌ అన్న సంగతి తెలిసిందే! ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటించగా కీర్తి సురేశ్‌ చిరు చెల్లెలిగా నటించింది. మెగా మూవీపై అంచనాలు భారీగానే ఉన్నప్పటికీ సినిమా మాత్రం చాలా పేలవమైన కలెక్షన్స్‌ రాబట్టింది. ఆగస్టు 11న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. మెగాస్టార్‌కు ఫ్లాప్‌ ఇచ్చినందుకు డైరెక్టర్‌ మెహర్‌ రమేశ్‌ను నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారు.

భోళా శంకర్‌కు వచ్చిన నెగెటివ్‌ టాక్‌ వల్ల చాలామంది ఈ సినిమావైపు కన్నెత్తి చూడలేదు. కానీ ఫ్యాన్స్‌ మాత్రం ఓటీటీలో ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్‌ ఫిక్స్‌ అయింది. ఈ మూవీ డిజిట్‌ హక్కులు సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్‌ ఈ నెల 15 నుంచి భోళాశంకర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది. థియేటర్లలో ఈ సినిమా చూడటం మిస్‌ అయినవాళ్లు ఓటీటీలో ఓసారి పట్టు పట్టేయండి..

చదవండి: సినిమా క్రేజే వేరప్పా.. కానీ డబుల్‌ మీనింగ్‌ డైలాగులు, సభ్యత లైన్‌ చెరిపేయడం.. ఓటీటీలో అయితే..

Advertisement
 
Advertisement