
బాలీవుడ్ యువనటుడు ఇషాన్ ఖట్టర్ ప్రస్తుతం హోమ్‌బౌండ్ అనే మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని విడుదలకు ముందే 78వ కేన్స్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రీమియర్ షో ప్రదర్శించారు. ఈ ప్రీమియర్‌కు జాన్వీ కపూర్, నిర్మాత కరణ్ జోహార్, దర్శకుడు నీరజ్ ఘయ్వాన్ కూడా హాజరయ్యారు. బాలీవుడ్‌లో విభిన్నమైన పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇషాన్.. టబుతో నటించిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఆమెతో ఇంటిమేట్ సీన్స్ చేయండపై మాట్లాడారు. ఇద్దరి మధ్య వయస్సు తేడా ఉన్నప్పటికీ ఆమెతో అలాంటి సీన్స్ చేయడం ఇబ్బందిగా అనిపించలేదని అన్నారు.
ఇషాన్ మాట్లాడుతూ.. " నిజాయితీగా చెప్పాలంటే టబు లాంటి నటితో దాని గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. ఇది మీకు వింతగా అనిపించవచ్చు.. ఆమెతో ఇంటిమేట్ సీన్ చేయడానికి నేను భయపడలేదు. నిజానికి నేను చాలా సేఫ్‌గా భావించా. ఎందుకంటే నేను ఏమి చేస్తున్నానో అర్థం చేసుకోవడమే కాకుండా.. దాన్ని మరోస్థాయికి తీసుకెళ్లగలిగే నటితో నేను నటించా. అదే టబులో ఉన్న గొప్పదనం. మనం ఒక సన్నివేశంలో ఏమి చేస్తున్నామో దాని గురించి ఎప్పుడూ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆమెతో కలిసి పనిచేయడం చాలా సరదాగా ఉంది. ఆమె సెట్‌లో చిన్నపిల్లాడిలా ఉంటుంది. జోక్స్ వేస్తూ అందరినీ నవిస్తుంది " అని అన్నారు.
కాగా.. ఇషాన్ ఖట్టర్ గతంలో 'ఎ సూటిబుల్ బాయ్' అనే వెబ్ సిరీస్‌లో టబుతో కలిసి నటించారు. 1993లో విక్రమ్ సేథ్ రాసిన అదే పేరుతో వచ్చిన నవల ఆధారంగా రూపొందించిన ఈ సిరీస్‌లో టబు నటించింది. సీనియర్ హీరోయిన్ టబుతో ఇషాన్ ఖట్టర్ ఇంటిమేట్ సీన్స్‌ను తెరకెక్కించారు. మరోవైపు ఇషాన్ చివరిసారిగా 'ది రాయల్స్'లో కనిపించాడు. ఇది ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది. ఈ చిత్రంలో భూమి పెడ్నేకర్, నోరా ఫతేహి, డినో మోరియా, మిలింద్ సోమన్, ల్యూక్ కెంట్ కీలక పాత్రల్లో నటించారు.