Iron Gun Movie: యువ శాస్త్రవేత్తలను సత్కరించిన ‘ఐన్‌గరన్‌’ మూవీ టీం

Iron Gun Movie Team Honoured Young Scientists In Chennai - Sakshi

సాక్షి, చెన్నై: ఐన్‌గరన్‌ చిత్ర యూనిట్‌ యువ శాస్త్రవేత్తలను గౌరవించింది. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌కుమార్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ఐన్‌గరన్‌. ఈటీ చిత్రం ఫేమ్‌ రవిఅరసు దర్శకత్వంలో కామన్‌ మ్యాన్‌ పతాకంపై బి. గణే ష్‌ నిర్మించారు. గత నెల 17వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణను, విమర్శల ప్రశంసలు అందుకుంది. కాగా ఈ నెల 10 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ చిత్రాన్ని వారంలోనే మూడు మిలియన్ల ప్రేక్షకులు వీక్షించడం విశేషం.

కాగా ఒక యువ విజ్ఞాని ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రజల నుంచి ఆదరణ లభించడంతో చిత్ర యూనిట్‌ బుధవారం యువ శాస్త్రవేత్తలను గౌరవించే కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక గిండీలోని ఓ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమానికి అబ్దుల్‌ కలామ్‌ అనుచరుడు పొన్‌రాజ్‌ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాలకు చెందిన 30కి పైగా యువ శాస్త్రవేత్తలను ఆహ్వానించి పొన్‌రాజ్‌ నేతృత్వంలో ఘనంగా సత్కరించి కానుకలను అందించారు. ఓ విజ్ఞాని ఇతివృత్తంతో ఐన్‌గరన్‌ చిత్రాన్ని మంచి సందేశాత్మకంగా మలిచారని పొన్‌రాజ్‌ చిత్రం యూనిట్‌ను అభినందించారు.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top