'ట్రూ' మూవీ ఫస్ట్ లుక్ విడుదల.. | Investigative Thriller True Movie First Look Poster Release | Sakshi
Sakshi News home page

ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లల్‌గా 'ట్రూ'

Apr 7 2021 1:16 PM | Updated on Apr 7 2021 1:21 PM

Investigative Thriller True Movie First Look Poster Release - Sakshi

గ్రీన్ లీఫ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ కేఆర్ గారు నిర్మించిన 'ట్రూ' మూవీ :ఫస్ట్‌ లుక్‌ రిలీజైంది. మూవీ క్రిటిక్‌, ప్రముఖ యాంకర్‌ టి.ఎన్ ఆర్ ట్రూ మూవీ పోస్ట్‌ర్‌ను లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా మూవీ టీంకు బెస్ట్‌ విషెస్‌ అందజేశారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్యామ్‌ మండల డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రంలో హరీష్‌ వినయ్‌ హీరోగా నటించగా, మణికంఠ ముఖ్య పాత్ర పోషించారు. 

హీరో హరీష్ వినయ్ మాట్లాడుతూ " బైలంపుడి నా మొదటి సినిమా, ఈ ట్రూ మూవీ నా సెకండ్ మూవీ. నా మీద నమ్మకముంచి నన్ను హీరోగా ఎంపిక చేసుకున్నందుకు ప్రొడ్యూసర్ కేఆర్ గారికి,  డైరెక్టర్ శ్యామ్ మండల గారికి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జానకి రామారావు గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.. అలాగే పోస్టర్ లాంచ్ చేయడానికి వచ్చిన టి.ఎన్ ఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.. .

డైరెక్టర్ శ్యామ్ మండల  మాట్లాడుతూ " నాకు దర్శకుడిగా ఈ ట్రూ మూవీ మొదటి సినిమా.. నన్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నాకీ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ కేఆర్ గారికి మరియు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జానకి రామారావు గార్లకి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ ట్రూ మూవీ ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఎక్కడా డీవియేట్ అవకుండా హోల్ మూవీ ఎంగేజింగ్ గా రన్ అవుతుంది. డెఫినిట్ గా ట్రూ మూవీ పెద్ద సక్సెస్ అవుతుందని నా నమ్మకం.. ఇక ఎంతో బిజీ గా ఉన్నప్పటికీ పిలవగానే రావడానికి ఒప్పుకున్న మా శ్రేయోభిలాషి టి.ఎన్ ఆర్ గారికి మనస్ఫూర్తిగా నా ప్రత్యేక కృతజ్ఞతలు" అంటూ ముగించారు.

Advertisement
 
Advertisement
Advertisement