
ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ఎంపీ ఇళయరాజా భారత రక్షణశాఖకు తన ఒక్క రోజు పారితోషకాన్ని విరాళంగా ప్రకటించారు. దీని గురించి ఆయన తన ఎక్స్ మీడియాలో పేర్కొంటూ పహల్గామ్‌లో మన దేశ పర్యాటకులపై ఉగ్రమూక దాడిచేసిందని, మన దేశ సైనికులు దీనికి తప్పక ప్రతీకారం తీర్చుకోవాలన్నారు. వారి ధైర్య సాహసాలు అభినందనీయం అని తెలిపారు. మన సైనికులు ఆత్మస్థైర్యంతో వారిని మట్టు పెడతారనే నమ్మకంతో,మన దేశ రక్షణ శాఖకు దేశ పౌరుడిగా, ఎంపీగా తన ఒక్క రోజు పొరితోషికాన్ని విరాళంగా ప్రకటిస్తున్నట్లు ఇళయరాజా పేర్కొన్నారు. కాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్– పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రం కావడంతో దేశం మొత్తం హై అలెర్ట్ ప్రకటించడం, తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ఇరుదేశాల సరిహద్దుల్లో శాంతి నెలకొనడం తెలిసిందే.