ఐదు భాషల్లో 'ఇక్షు'.. ట్రైలర్‌ రిలీజ్‌ చేసిన దిల్‌రాజు | Sakshi
Sakshi News home page

Ikshu Movie Trailer: ఐదు భాషల్లో 'ఇక్షు'.. ట్రైలర్‌ రిలీజ్‌ చేసిన దిల్‌రాజు

Published Mon, Aug 22 2022 3:27 PM

Ikshu Movie Trailer Launch By Dil Raju - Sakshi

రామ్‌ అగ్నివేష్, రేఖ నీరోషా  జంటగా వీవీ రుషిక దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇక్షు’. డాక్టర్‌ గౌతమ్‌ నాయుడు సమర్పణలో హనుమంతురావు నాయుడు నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 16న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ని ‘దిల్‌’ రాజు విడుదల చేశారు. రుషిక మాట్లాడుతూ– ‘‘సిద్ధం మనోహర్‌ ఇచ్చిన కథ నచ్చి, ఈ చిత్రానికి దర్శకత్వం వహించాను. ఈ ఫ్యామిలీ థ్రిల్లర్‌ని ఐదు భాషల్లో విడుదల చేస్తున్నాం’’ అన్నారు.

‘‘మా చిత్రం గొప్ప విజయం సాధిస్తుందనే నమ్మకం   ఉంది’’ అన్నారు హనుమంతురావు నాయుడు. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు బసిరెడ్డి, నిర్మాతలు బెక్కం వేణుగోపాల్, దామోదర ప్రసాద్, సినిమాటోగ్రాఫర్‌ నవీన్‌ తొడిగి తదితరులు మాట్లాడారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుజిత్‌ కుమార్‌ గుత్తుల, సంగీతం: వికాస్‌ బాడిస.  
 

Advertisement
 
Advertisement
 
Advertisement