Hyderabad Police Lathi Charge On Jr NTR Fans - Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ అభిమానులపై హైదరాబాద్‌ పోలీసులు లాఠీచార్జ్‌

May 20 2022 8:39 AM | Updated on May 20 2022 9:57 AM

Hyderabad Police Lathicharge On Jr NTR Fans - Sakshi

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ అభిమానులపై హైదరాబాద్‌ పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. నేడు(మే 20) ఎన్టీఆర్‌ 39వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి గురువారం అర్థరాత్రి అభిమానులంతా ఆయన ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ ఇంట్లో లేకపోవడంతో.. ఆయన రాకకోసం రోడ్డుపైనే ఎదురుచూశారు. ఈ క్రమంలో కొంతమంది అభిమానులు కేక్‌ కట్‌ చేసి.. జై ఎన్టీఆర్‌ అంటూ రోడ్డుపై హంగామ సృష్టించారు.

దీంతో అటువైపు వెళ్తున్న వాహనదారులకు ఇబ్బంది ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసలు..ఎన్టీఆర్‌ ఇంటివద్దకు చేరుకొని..అభిమానులను పక్కకు తరలించే ప్రయత్నం చేశారు. ఫ్యాన్స్‌ అంతా వెళ్లిపోవాలని ఆదేశించినా.. పట్టించుకోకుండా డాన్స్‌ చేస్తూ రచ్చరచ్చ చేశారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. కొంతమంది అభిమానులను అదుపులోకి కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున పోలీసులు వచ్చి..లాఠీచార్జ్‌ చేయడంతో అభిమానులు అక్కడ నుంచి వెళ్లిపోయారు.  

Advertisement
 
Advertisement
Advertisement