ఓటీటీలో దూసుకెళ్తున్న ‘ఏకమ్‌’.. రెండో స్థానంలో చోటు | Huge Response For Eakam Movie In Amazon Prime Video | Sakshi
Sakshi News home page

Eakam: ఓటీటీలో దూసుకెళ్తున్న ‘ఏకమ్‌’.. రెండో స్థానంలో చోటు

Jan 22 2022 4:30 PM | Updated on Jan 23 2022 9:58 AM

Huge Response For Eakam Movie In Amazon Prime Video - Sakshi

కొన్ని సినిమాలో థియేటర్స్‌లో అంతగా ఆడకపోయినా ఓటీటీలో మాత్రం సూపర్‌ హిట్‌ అవుతాయి. అలాంటి వాటిలో ‘ఏకమ్‌’ఒకటి. పంచ భూతాల నేపథ్యంలో ఫిలసాఫికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి  వరుణ్ వంశీ దర్శకత్వం వహించగా.. ఎస్.ఎమ్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై ఎ.కళ్యాణ్ శాస్త్రి-పూజ.ఎమ్-శ్రీరామ్.కె సంయుక్తంగా నిర్మించారు.  అభిరామ్ వర్మ, శ్వేతావర్మ, తనికెళ్ళ భరణి, అదితి మ్యాకల్, కల్పిక గణేష్, దయానంద్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

అమెజాన్ ప్రైమ్ లో 503 వ చిత్రంగా విడుదలైన ‘ఏక​మ్‌’ కేవలం పదిహేను రోజుల్లో టాప్-2కి చేరి... మొదటి స్థానం కోసం ‘పుష్ప’తో పోటీ పడుతోంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు వరుణ్ వంశీ మాట్లాడుతూ... "ఏకమ్" చిత్రానికి అమెజాన్ లో రెండో స్థానం దక్కడం కలలా ఉంది... చాలా గర్వంగానూ ఉంది.  ఇంతవరకు తెలుగులో రాని యూనీక్ జోనర్ లో రూపొందిన "ఏకమ్" చిత్రానికి అవార్డులతోపాటు రివార్డులు కూడా వస్తుండడం మరీ సంతోషంగా ఉంది" అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement