20 ఏళ్ల కల.. కొత్త వ్యాపార రంగంలో అడుగుపెట్టిన హనీరోజ్‌ | Honey Rose Launched Movie Production House | Sakshi
Sakshi News home page

20 ఏళ్ల కల.. కొత్త వ్యాపార రంగంలో అడుగుపెట్టిన హనీరోజ్‌

Sep 7 2024 9:55 AM | Updated on Sep 7 2024 1:39 PM

Honey Rose Launched Movie Production House

‘వీరసింహారెడ్డి’  సినిమాతో టాలీవుడ్‌లో బాగా పాపులర్‌ అయిన కేరళ ముద్దుగుమ్మ హనీరోజ్‌ . ఆ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్‌లో కనిపించకపోయినా రోజూ సోషల్‌మీడియాలో  సందడి చేస్తూనే ఉంటుంది. తన గ్లామర్‌ ఫోటోలతో పాటు లెక్కలేనన్ని షాపింగ్ మాల్‌ ప్రారంభోత్సవాల్లో పాల్గొంటూ అభిమానులకు దగ్గరగానే ఉంటుంది. సినిమాలు చేయకపోయిన స్టార్‌ హీరోయిన్‌లకు మించిన పాపులారిటీని సొంతం చేసుకుంది. 

నిర్మాతగా హనీరోజ్‌ 
ఇప్పటి వరకు సినిమాల్లో నటించిన హనీరోజ్‌.. త్వరలో నిర్మాతగా మారనుంది. 'హనీ రోజ్ వర్గీస్ ప్రొడక్షన్స్' పేరుతో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని తాజాగా తన సోషల్‌మీడియా ద్వారా తెలిపింది. ఈ క్రమంలో తన సంస్థ లోగోను కూడా పంచుకుంది.

'హనీ రోజ్ వర్గీస్ ప్రొడక్షన్స్' లోగో పోస్టర్‌తో పాటు హనీరోజ్‌ ఇలా చెప్పుకొచ్చింది. ' సినిమా అనేది చాలా మందికి ఒక కల, ఒక విజన్, ఒక వెంచర్. అదొక ఫాంటసీ. అదొక జీవిత కోరిక. దాదాపు 20 ఏళ్లుగా సినిమాల్లో నును భాగం అయ్యాను. దీనిని నేను ఓ వరంలా భావిస్తున్నాను. నా యవ్వనం, జీవితం, చదువు, స్నేహం ఇలా అన్నింటిలో సినిమానే పెద్ద పాత్ర పోషించింది. కాబట్టి ఈ పరిశ్రమలో పెద్ద పాత్ర పోషించడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. నా పుట్టినరోజు  సందర్భంగా గర్వంగా నా కొత్త వెంచర్ లోగోను లాంచ్ చేస్తున్నాను. 'హనీ రోజ్ వర్గీస్ ప్రొడక్షన్స్'. సినీ ప్రేమికుల నుంచి నాకు లభించిన ప్రేమే నాకు గొప్ప పాత్రలు వచ్చేలా చేసింది. నాపై మీరు చూపించిన ప్రేమ ఎప్పటికీ కొనసాగుతుందని ఆశిస్తున్నాను. నా ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ  కృతజ్ఞతలు చెప్తున్నా.' అని తెలిపింది.

HRV ప్రొడక్షన్స్ ద్వారా నా కోరిక, ఆశ నెరవేరుతుందని భావిస్తున్నాను. టాలెంట్‌ ఉండి ఛాన్స్‌ల కోసం ఎదురుచూస్తున్న ప్రతిభావంతులకు ఇదొక వారధిలా నిలబడుతుంది. మా ప్రొడక్షన్‌ ద్వారా వచ్చే సినిమాలు ఇండస్ట్రీ కీర్తిని తీసుకొచ్చేలా ఉంటాయి. ఈ క్రమంలో అద్భుతమైన కథలను చెప్పాలనుకుంటున్నాము.' అని హనీ రోజ్ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement