హనీ రోజ్‌కు చేదు అనుభవం.. అసభ్యంగా తాకుతూ..! | Malayalam actress Honey Rose faced Harassment at shopping mall opening | Sakshi
Sakshi News home page

Honey Rose: హనీ రోజ్‌కు వేధింపులు.. వీడియో వైరల్‌..!

Mar 30 2026 12:38 PM | Updated on Mar 30 2026 12:55 PM

Malayalam actress Honey Rose faced Harassment at shopping mall opening

మలయాళ బ్యూటీ హనీ రోజ్‌కు చేదు అనుభవం ఎదురైంది. కేరళలోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వెళ్లిన ఆమెతో కొందరు అసభ్యంగా ప్రవర్తించారు. షాపింగ్‌ మాల్‌ దగ్గర హీరోయిన్‌తో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. వారితో సెల్ఫీ దిగే సమయంలో ఒకరు ఆమె నడుముపై చేతులు వేస్తూ కనిపించారు. దీంతో అసౌర్యానికి గురైన హనీ రోజ్ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారి తీరుపై నెటిజన్స్ మండిపడుతున్నారు. సెలబ్రిటీలను అలా వేధించడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

హనీ రోజ్‌ సినిమా కెరీర్..

ఈ మలయాళ బ్యూటీ 2008లో ఆలయం సినిమాతో తెలుగువారికి పరిచయమైంది. ఆ తర్వాత ఈ వర్షం సాక్షిగా (2014) చిత్రంలో నటించింది. దాదాపు దశాబ్దకాలం గ్యాప్‌ ఇచ్చాక వీరసింహారెడ్డితో మెరిసింది. ఈ చిత్రంతోనే హనీరోజ్‌ టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది.  

 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement