‘వీరసింహారెడ్డి’ సినిమాతో బాగా పాపులర్ అయిన కేరళ బ్యూటీ హనీరోజ్. ఆ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్‌లో కనిపించకపోయినప్పటికీ టాలీవుడ్‌లో మాత్రం క్రేజ్ తగ్గడం లేదు. అయితే, చాలారోజుల తర్వాత ‘రాహేలు’ సినిమాతో తెరపైకి రాబోతుంది. ఈ క్రమంలోనే తాజాగా మలయాళంలో ట్రైలర్ విడుదలైంది. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రం డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు ఆనందిని బాలా రివేంజ్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీలో మలయాళ ప్రముఖ నటులు రోషన్ బషీర్, రాధికా రాధాకృష్ణన్ కీలక పాత్రలో నటించారు. రాహేలు చిత్రంతో గతంలో ఎన్నడూ చూడని పాత్రలో హనీరోజ్ కనిపిస్తూ సినీప్రియుల దృష్టిని మరోసారి ఆకట్టుకుంటుంది.


