Hollywood: రూ.1000 కోట్ల రెమ్యునరేషన్‌ అందుకున్న స్టార్‌ హీరో

Highest Paid Actors of 2022: Tom Cruise Gets 100 million Dollars - Sakshi

సినిమాలో ఎవరి పారితోషికం ఎక్కువ అంటే హీరోలదే అన్న సమాధానం వస్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే! అయితే రానురానూ షూటింగ్‌ బడ్జెట్‌ కంటే కూడా కథానాయకుల పారితోషికానికి పెట్టే బడ్జెటే ఎక్కువవుతూ వస్తోంది. ఇప్పటికే టాలీవుడ్‌, బాలీవుడ్‌ హీరోలు రూ.40, 50, 100 కోట్ల వరకు తీసుకుంటున్నారు. అయితే హాలీవుడ్‌ హీరోలు మాత్రం ఓస్‌, వందేనా.. మేము వెయ్యి కోట్లు తీసుకుంటున్నాం. అయినా ఇది మాకు చాలా మామూలు విషయమని తేలికగా తీసిపారేస్తున్నారట.

హాలీవుడ్‌లో ఏ హీరో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నాడనేదానిపై తాజాగా ఓ సర్వే లెక్కలు బయటకు వచ్చాయి. ఇందులో టామ్‌ క్రూయిజ్‌ దాదాపు రూ.800 కోట్ల(100 మిలియన్‌ డాలర్స్‌) చొప్పున తీసుకుంటున్నాడట! టాప్‌ గన్‌: మావెరిక్‌ సినిమాకు ఇంత మొత్తాన్నే వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు నిర్మాత కూడా టామ్‌ క్రూయిజే కావడంతో బోనస్‌గా అతడికి మరో రూ.180 కోట్ల దాకా వచ్చాయట. అంటే మొత్తంగా ఒక్క సినిమాకే ఈ స్టార్‌ హీరో దాదాపు వెయ్యి కోట్ల మేర వెనకేశాడన్నమాట.

ఇక ఆస్కార్‌ అవార్డుల ఫంక్షన్‌లో హోస్ట్‌ క్రిస్‌ రాక్‌ చెంప చెల్లుమనిపించి సెన్సేషన్‌ అయిన విల్‌ స్మిత్‌ ఎమాన్సిపేషన్‌ మూవీకిగానూ రూ.280 కోట్లు (35 మిలియన్‌ డాలర్స్‌) అందుకున్నాడట. లినార్డో డికాప్రియో, బ్రాడ్‌ పిట్‌ ఇద్దరూ తాము నటిస్తున్న సినిమాకు రూ.240 కోట్లు(30 మిలియన్‌ డాలర్స్‌) అందుకున్నారట. డ్వేన్‌ జాన్సన్‌ రూ.180 కోట్లు (22.5 మిలియన్‌ డాలర్స్‌), క్రిస్‌ హేమ్స్‌వర్త్‌, డెంజెల్‌ వాషింగ్టన్‌, విన్‌ డీజిల్‌, జాక్విన్‌ ఫోనిక్స్‌, టామ్‌ హార్డీ, విల్‌ ఫెరల్‌, ర్యాన్‌ రెనాల్డ్స్‌ తలా రూ.160 కోట్లు (20 మిలియన్‌ డాలర్స్‌) వెనకేసుకుంటున్నారట.

చదవండి: ప్రాణం కాపాడినవాన్నే అణచివేస్తే.. 'పరంపర 2' సిరీస్​ రివ్యూ
వేదం బ్యూటీ ఇలా అయిపోయిందేంటి?

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top