అందుకే పునీత్‌ చేసిన మంచి పనుల్లో ఒకటి చెయ్యాలి అనుకున్నా: విశాల్‌ | Hero Vishal Visited Tirumala By Walk | Sakshi
Sakshi News home page

Vishal: అందుకే పునీత్‌ చేసిన అనేక మంచి పనుల్లో నేను ఒకటి చెయ్యాలి అనుకున్నా

Nov 3 2021 8:36 AM | Updated on Nov 3 2021 11:09 AM

Hero Vishal Visited Tirumala By Walk - Sakshi

సాక్షి, తిరుమల: హీరో విశాల్‌ బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆయన మాట్లాడుతూ.. 'నాలుగు సంవత్సరాల తర్వాత స్వామివారిని దర్శించుకున్నాను. కాలి నడకన దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకొన్నాను. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ధన్యవాదాలు.

దీపావళికి 'ఎనిమీ' చిత్రం విడుదల అవుతుంది. కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్ మరణం చాలా బాధించింది. కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్లు ఉంది. అందుకే అతను చేసిన అనేక మంచి పనుల్లో నేను ఒకటి చెయ్యాలి అనుకున్నా. పిల్లల చదువుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను' అని హీరో విశాల్‌ తెలిపారు.

చదవండి: (50 రకాల వంటకాలతో పునీత్‌కు పాలశాస్త్రం పూజలు) 

Advertisement
 
Advertisement
Advertisement