‘అనన్య’ విజయం సాధించాలి: హీరో శ్రీకాంత్‌ | Sakshi
Sakshi News home page

‘అనన్య’ విజయం సాధించాలి: హీరో శ్రీకాంత్‌

Published Wed, Mar 6 2024 3:53 PM

Hero Srikanth Launches New Poster Of Ananya Movie - Sakshi

జయరామన్, చందన, తోషి అలహరి, ప్రజ్ఞ గౌతమ్, అరవింద్, సుమన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘అనన్య’. ప్రసాద్ రాజు బొమ్మిడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ సిద్ధి ధాత్రి మూవీ క్రియేషన్స్ పతాకంపై జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ  నిర్మిస్తున్నారు. హర్రర్ నేపథ్యంలో కుటుంబ ప్రేమ కథాచిత్రంగా రూపొందిన ఈ చిత్రం సెన్సార్ తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 22న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో "అనన్య" ప్రచార చిత్రాన్ని శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్ ఆవిష్కరించి, ఈ చిత్రం ఘన విజయం సాధించాలని అభిలషించారు.

ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను కచ్చితంగా అలరించి తమ "శ్రీ సిద్ధి ధాత్రి మూవీ క్రియేషన్స్"కు శుభారంభాన్నిస్తుందని నిర్మాత జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ పేర్కొన్నారు. సెన్సార్ సభ్యుల ప్రశంసలు దండిగా అందుకుని, ఈనెల 22న వస్తున్న "అనన్య" ప్రేక్షకుల ఆదరాభిమానాలు సైతం పుష్కలంగా పొందుతుందనే నమ్మకం ఉందని దర్శకుడు ప్రసాద్ రాజు బొమ్మిడీ తెలిపారు. తమ చిత్రం ట్రైలర్ రిలీజ్ చేసి, ఆల్ ది బెస్ట్ చెప్పిన హీరో శ్రీకాంత్ కు దర్శకనిర్మాతలు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
 
Advertisement