అతని వివరాలు తెలియజేస్తే సాయం చేస్తా: సంపూర్ణేష్‌బాబు  | Hero Sampoornesh Babu Jangareddigudem Maddi Anjaneya Temple | Sakshi
Sakshi News home page

అతని వివరాలు తెలియజేస్తే సాయం చేస్తా: సంపూర్ణేష్‌బాబు 

Apr 20 2022 10:44 AM | Updated on Apr 20 2022 10:44 AM

Hero Sampoornesh Babu Jangareddigudem Maddi Anjaneya Temple - Sakshi

సాక్షి, జంగారెడ్డిగూడెం రూరల్‌: గురవాయిగూడెంలోని శ్రీమద్ది ఆంజనేయస్వామిని సినీ హీరో సంపూర్ణేష్‌బాబు మంగళవారం దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనం అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఈఓ ఆకుల కొండలరావు స్వామివారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని ఆయనకు అందజేశారు. మంగళవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 

సంపూర్ణేష్‌బాబుకి స్వామివారి ప్రసాదాన్ని అందిస్తున్న ఆలయ ఈఓ   

వివరాలిస్తే సాయం చేస్తా 
జంగారెడ్డిగూడెం: సినీ హీరో, బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌బాబు జంగారెడ్డిగూడెంలో సందడి చేశారు. స్థానిక బైనేరు వద్ద ఉన్న పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సంపూర్ణేష్‌బాబు మాట్లాడుతూ తనను ఈ ప్రాంతానికి ఆహ్వానించిన స్వర్ణకార సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

తాను నటించిన చిత్రం ఈ నెలలో ఒకటి విడుదల కానుందని, అలాగే రెండు సినిమాలు షూటింగ్‌ దశలో ఉన్నాయన్నారు. స్వర్ణకార సభ్యులు టి.నరసాపురానికి చెందిన ఒక వ్యక్తి ఆర్థిక పరిస్థితి బాగాలేదని, సహాయపడాలని కోరగా, అతని వివరాలు తనకు తెలియజేస్తే సాయం చేస్తానని సంపూర్ణేష్‌బాబు హామీ ఇచ్చారు. స్వర్ణకార సంఘం అధ్యక్షులు భోగేశ్వరరావు, ఈఓ ఆకుల కొండలరావు, వాడపల్లి శ్రీనివాస్, తుపాల సాయికృష్ణ పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement