ఐసీయూలో హీరో రాజశేఖర్‌ | Hero Rajasekhar In ICU | Sakshi
Sakshi News home page

ఐసీయూలో హీరో రాజశేఖర్‌

Oct 23 2020 6:30 AM | Updated on Oct 23 2020 5:18 PM

Hero Rajasekhar In ICU - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌తో బాధపడుతూ ఇటీవల హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్‌లో చేరిన హీరో రాజశేఖర్‌కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు గురువారం ప్రకటించాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైద్య చికిత్సకు ఆయన శరీరం స్పందిస్తోందని వైద్యులు తెలిపారు. నటుడు రాజశేఖర్, ఆయన కుటుంబ సభ్యులకు ఇటీవల కరోనా సోకిన సంగతి తెలిసిందే. ‘

పిల్లలు.. శివాత్మిక, శివానీ ఇద్దరికీ బాగానే ఉంది. నేను, జీవిత చికిత్స తీసుకుంటున్నాం’ అని ట్విట్టర్‌ ద్వారా నాలుగు రోజుల క్రితం ఆయన తెలిపిన సంగతి విదితమే. కాగా, రాజశేఖర్‌ ఆరోగ్యం విషమించిందన్న వార్తలను ఆయన కుటుంబం ఖండించింది. పుకార్లను నమ్మవద్దని కోరింది. ‘నాన్నగారు కోవిడ్‌తో పోరాడుతున్నారు. మీ అందరి ప్రార్థనలు కావాలి. మీ ప్రేమతో ఆయన మరింత ఆరోగ్యంగా బయటకు వస్తారు’ అని ఆయన కుమార్తె శివాత్మిక గురువారం ట్వీట్‌ చేశారు. ఇదే విషయాన్ని ఒక లేఖ ద్వారా కూడా ఆయన కుటుంబం తెలిపింది.   

Advertisement
 
Advertisement
Advertisement