Manchu Vishnu : షూటింగ్‌ సెట్‌లో గాయపడ్డ మంచు విష్ణు.. అతని వల్లే అంటూ పోస్ట్‌

Hero Manchu Vishnu Injured Badly On Ginna Sets Shares Pic - Sakshi

యంగ్‌ హీరో మంచు విష్ణు జయపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఇషాన్‌ సూర్య దర్శకత్వంలో జిన్నా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా కోసం మంచు విష్ణు చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న విష్ణు గాయాలపాలయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేసుకున్నారు.

ఓ సాంగ్‌ షూటింగ్‌లో భాగంగా గాయం అయ్యిందని,  కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ స్టెప్స్ వల్ల అయ్యిందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విష్ణు షేర్‌ చేసిన ఈ పోస్ట్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ  ఈ చిత్రాన్నినిర్మిస్తున్న ఈ చిత్రంలో సన్నీ లియోన్, పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే నెల అక్టోబర్ 5న ఈ చిత్రం విడుదల కానుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top