Hero Karthikeya Marriage: Pellikoduku Function Photos Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Karthikeya: పెళ్లికొడుకుగా ముస్తాబైన హీరో కార్తికేయ.. ఫోటోలు వైరల్‌

Nov 20 2021 1:50 PM | Updated on Nov 20 2021 2:06 PM

Hero Karthikeya Pellikoduku Function Photos Goes Viral - Sakshi

Hero Karthikeya Pellikoduku Function Photos Goes Viral: హీరో కార్తికేయ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. మరికొద్ది గంటల్లో ప్రేమించిన అమ్మాయి మెడ‌లో మూడు ముళ్లు వేసి ఆమెను త‌న అర్ధాంగిగా మార్చుకోనున్నాడు. ఆగస్టులో గ్రాండ్‌గా నిశ్చితార్థం జరుపుకున్న కార్తికేయ రేపు(నవంబర్‌21)న ఉద‌యం 9 గంట‌ల 47 నిమిషాల‌కు లోహితను పెళ్లాడనున్నాడు.ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు జోరుగా జరుగుతుండగా..కార్తికేయ పెళ్లికొడుకుగా ముస్తాబయ్యాడు.

దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కార్తికేయ పెళ్లి వేడుకకు  ఆయ‌న బంధుమిత్రుల‌తో పాటు టాలీవుడ్ సెల‌బ్రిటీలు హాజ‌రు కానున్న‌ట్లు తెలుస్తోంది. కాగా  ఆర్‌ఎక్స్‌100 సినిమాతో యూత్‌లో మాంచి క్రేజ్‌ సంపాదించుకున్న హీరో కార్తికేయ ఇటీవలె రాజా విక్రమార్క సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. 

చదవండి: ఆమె పంపిన మెసేజ్‌ వల్ల మా ఇంట్లో గొడవ జరిగింది : కార్తికేయ
బ్రేకప్‌ తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చైతూ..

Advertisement
 
Advertisement
Advertisement