breaking news
functon
-
పెళ్లికొడుకుగా ముస్తాబైన హీరో కార్తికేయ.. ఫోటోలు వైరల్
Hero Karthikeya Pellikoduku Function Photos Goes Viral: హీరో కార్తికేయ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. మరికొద్ది గంటల్లో ప్రేమించిన అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేసి ఆమెను తన అర్ధాంగిగా మార్చుకోనున్నాడు. ఆగస్టులో గ్రాండ్‌గా నిశ్చితార్థం జరుపుకున్న కార్తికేయ రేపు(నవంబర్21)న ఉదయం 9 గంటల 47 నిమిషాలకు లోహితను పెళ్లాడనున్నాడు.ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు జోరుగా జరుగుతుండగా..కార్తికేయ పెళ్లికొడుకుగా ముస్తాబయ్యాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కార్తికేయ పెళ్లి వేడుకకు ఆయన బంధుమిత్రులతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. కాగా ఆర్ఎక్స్100 సినిమాతో యూత్‌లో మాంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో కార్తికేయ ఇటీవలె రాజా విక్రమార్క సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. చదవండి: ఆమె పంపిన మెసేజ్ వల్ల మా ఇంట్లో గొడవ జరిగింది : కార్తికేయ బ్రేకప్ తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చైతూ.. -
4జీతో మరింత సౌలభ్యం
శాంతినగర్: వడ్డేపల్లి మండల కేంద్రమైన శాంతినగర్‌లో ఐడియా 4జీ సేవలు ప్రారంభించడం హర్షించదగ్గ విషయమని మానవపాడు ఎస్ఐ భగవంత్‌రెడ్డి అన్నారు. ఐడియా సంస్థ 4జీ సేవలు ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్‌చేసి సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ గతేడాది శాంతినగర్‌లో త్రీజీ సేవలు ప్రారంభించిన ఐడియా సంస్థ ఇంటర్నెట్ వాడకం పెరుగుతున్న తరుణంలో వినియోగదారుల సౌకర్యం కొరకు 4జీ సేవలు వినియోగదారులకు అందుబాటులోకి తేవడం హర్షణీయమన్నారు. అనంతరం ఐడియా సంస్థ ఏరియా సేల్స్ మేనేజర్ జగన్నాథనాయుడు మాట్లాడుతూ శాంతినగర్‌లో ఇంటర్నెట్ వాడకం 50శాతం పెరిగిందని, అందువల్లే ఇంటర్నెట్ 4జీ స్పీడుతో మరింత వేగంగా వినియోగదారులకు సేవలు అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం వాడుతున్న వినియోగదారులకే 4జీ సిమ్ అదేనెంబర్‌పై ఇస్తూ కొత్త కష్టమర్లకు 2జీబీ 4జీ డేటా ఇస్తున్నామన్నారు. రాబోయే ఆరునెలల్లో ప్రతి గ్రామానికి త్రీజీ సేవలు విస్తరిస్తామన్నారు. అనంతరం పట్టణ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించి 4జీ సేవల ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో ఐడియా టీఎస్‌ఈలు ఖలీల్, హనీఫ్, గంగాధర్, స్థానిక డిస్ట్రిబ్యూటర్ ప్రవీణ్‌లు పాల్గొన్నారు.