Sardar Movie Twitter Review In Telugu - Sakshi
Sakshi News home page

Sardar Twitter Review: ‘సర్ధార్‌’ మూవీ ట్విటర్‌ రివ్యూ.. కార్తీ మరో హిట్‌ కొట్టేశాడా!

Oct 21 2022 9:33 AM | Updated on Oct 21 2022 10:21 AM

Hero Karthi Sardar Movie Twiiter Review - Sakshi

తమిళ హీరో కార్తీకి సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిట్‌, ప్లాప్స్‌తో సంబంధంగా లేకుండా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ హీరోగా దూసుకుపోతోన్నాడు. తమిళ్ లోనే కాదు తెలుగులోనూ కార్తీకి మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు తెలుగులోనూ మంచి విజయాలు సాధించిన విషయం తెలిసిందే. ఇటీవలే పొన్నియన్ సెల్వన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తీ ఇప్పుడు సర్ధార్‌గా థియేటర్లో అలరించేందుకు రెడీ అయ్యాడు. కార్తీ ప్రధాన పాత్రలో అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్ తెరకెక్కించిన సినిమా సర్దార్.

చదవండి: Ginna Twitter Review: ‘జిన్నా’మూవీ ట్విటర్‌ రివ్యూ

ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో రాశి ఖన్నా, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ దీపావళి కానుకగా ఈ శుక్రవారం(అక్టోబర్‌ 21) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కింగ్ అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాను తెలుగు రాష్ట్రాలలో భారీగా విడుదల చేస్తోంది.  తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే యుఎస్‌తో పాటు తమిళనాడులో పలు థియేటర్స్‌లో ప్రీమియర్ షోలు పడటంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ఎన్నో అంచనాల మధ్య నేడు థియేటర్లోకి వచ్చిన సర్ధార్‌ గురించి ట్విటర్‌లో ఏమంటున్నారో ఓసారి చూద్ధాం. 

Advertisement
 
Advertisement
Advertisement