Hero Karthi Japan: జపాన్‌కు సిద్ధమవుతున్న కార్తీ

హీరో కార్తీ జపాన్‌కు సిద్ధం అవుతున్నారట. ఇక్కడ జపాన్ అంటే దేశం అనుకునేరు. కానే కాదు. కార్తీ నటించే 24వ సినిమా పేరు. ప్రస్తుతం కార్తీ నటిస్తున్న సర్ధార్ చిత్రం వచ్చే దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మణిరత్నం దర్శకత్వంలో నటించిన భారీ చిత్రం పొన్నియన్ సెల్వన్ సెప్టెంబర్ 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతోంది. దీంతో తదుపరి చిత్రం ఏమిటన్నది కోలీవుడ్ వర్గాల్లో ఆసక్తిగా మారింది.
(చదవండి: ప్రియుడితో లాకప్ బ్యూటీ పెళ్లి, మేకప్ బెడిసికొట్టిందిగా!)
తాజాగా కార్తీ నూతన చిత్రం గురించి సామాజిక మాధ్యమాల్లో ఓ ప్రచారం వైరల్ అవుతోంది. కూక్కూ జోకర్ వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ నటించడానికి పచ్చజెండా ఊపారట. దీనిని డ్రీమ్ వారియర్ పతాకంపై ఎస్‌ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్‌ఆర్ ప్రభు నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి జపాన్ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. ఈ చిత్ర కథ కార్తీకి తగ్గట్టుగా, దర్శకుడు రాజు మురుగన్ బాణీలో ఉంటుందని తెలిసింది. సర్ధార్ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత కార్తీ ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.