Hero Aadhi Pinisetty And Nikki Galrani Wedding Teaser Is Out Now - Sakshi
Sakshi News home page

Aadi Pinisetty -Nikki Galrani : 'పెళ్లయి మూడ్నెళ్లు అయ్యింది.. కానీ నిన్నే అయినట్లుంది'

Aug 13 2022 10:51 AM | Updated on Aug 13 2022 11:44 AM

Hero Aadi Pinisetty And Nikki Galrani Wedding Teaser Is Out - Sakshi

హీరోయిన్‌ నిక్కీ గల్రానీతో నటుడు ఆది పినిశెట్టి వివాహం వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మేలో వివాహ బంధంతో ఒక్కటైన ఈ ప్రేమ జంట ఇప్పటికే తమ పెళ్లి ఫోటోలను షేర్‌ చేశారు. తాజాగా వీరిద్దరూ తమ పెళ్లి టీజర్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. మా పెళ్లై  మూడు నెలలు అవుతుంది. కానీ నిన్ననే ఇదంతా జరిగినట్లుంది. మేము ఎప్పటికీ మర్చిపోలేని రోజు అది. దీనికి సంబంధించిన మరిన్ని వీడియోలు త్వరలోనే మీ ముందుకు వస్తాయి అంటూ పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. హల్దీ, మెహందీ సహా పెళ్లి వరకు ప్రతీ మూమెంట్‌ని ఆది-నిక్కీ ఎంతో అనందంగా సెలబ్రేట్‌ చేసుకున్నారో వీడియోలో స్పష్టంగా అర్థమవుతుంది. కాగా 2015లో వచ్చిన 'యాగవరైనమ్‌ నా కక్కా' అనే సినిమాలో తొలిసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న ఆది-నిక్కీలు 'మరగాధ నాణ్యం' చిత్రంతో ప్రేమలో పడ్డారు. ఈ ఏడాది పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. 

Advertisement
 
Advertisement
Advertisement