Krishnam Raju: కృష్ణంరాజు మొదటి భార్య ఎలా చనిపోయిందో తెలుసా?

Here Is The Reason Behind Krishnam Raju Second Marraige - Sakshi

నటుడిగా, రాజకీయవేత్తగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న కృష్ణంరాజు అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన సినీ ప్రస్థానంలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా , హీరోగా నటించి తనకంటూ స్పెషల్‌ ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకున్నారు. 1966లో విడుదలైన ‘చిలకా గోరింకా’ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన కృష్ణంరాజు దాదాపు 187 చిత్రాల్లో నటించారు.

ఆయన చివరగా ప్రభాస్‌తో రాధేశ్యామ్‌ చిత్రంలో నటించారు. ఇక కృష్ణంరాజు వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆయన వివాహం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. కృష్ణంరాజుకు శ్యామల దేవి కంటే ముందే  సీత దేవితో వివాహం జరిగింది. 1969లో కోట సంస్థానాధీశుల వంశస్తులు రాజా కలిదిండి దేవి ప్రసాద వరాహ వెంకట సూర్యనారాయణ కుమార లక్ష్మీ కాంత రాజ బహుద్దూర్‌ (గాంధీబాబు), సరస్వతీ దేవిల కుమార్తెనె సీతాదేవి.

అయితే 1995లో సీతాదేవి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కొన్నాళ్ల పాటు కృష్ణంరాజు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారట. దీంతో ఆయన మానసిక పరిస్థితి గమనించిన కుటుంబసభ్యులు రెండో పెళ్లి కోసం ఆయన్ని ఒప్పించారట. తర్వాత 1996లో తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన శ్యామలాదేవితో కృష్ణంరాజుకు రెండో వివాహం జరిగింది. వీరికి ప్రసీది, ప్రకీర్తి, ప్రదీప్తి ముగ్గురు కుమార్తెలు.  

వీరితో పాటు మొదటి భార్య కుమార్తె కూడా కృష్ణంరాజు దగ్గరే ఉంటోది. ఇక మరో అమ్మాయిని కూడా కృష్ణంరాజు దత్తత తీసుకున్నారు. అలా ఐదుగురు ఆడపిల్లలకు కృష్ణంరాజు దంపతులు తల్లిదండ్రులుగా మారారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top