ఆ అంశాలు ఆకట్టుకుంటాయి: జీవీ ప్రకాష్‌ కుమార్‌ | GV Prakash about Varun Tej Matka Movie | Sakshi
Sakshi News home page

ఆ అంశాలు ఆకట్టుకుంటాయి: జీవీ ప్రకాష్‌ కుమార్‌

Nov 8 2024 3:11 AM | Updated on Nov 8 2024 3:11 AM

GV Prakash about Varun Tej Matka Movie

‘‘మట్కా’ సినిమా నేను చూశాను. చక్కని యాక్షన్‌ ఫిల్మ్‌. అద్భుతమైన కథ, నటన, డైరెక్షన్‌.. ఈ అంశాలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. వరుణ్‌ తేజ్‌గారు ఈ సినిమా కోసం తన కెరీర్‌లోనే బెస్ట్‌గా నటించారు. ఈ చిత్రం కచ్చితంగా బిగ్‌ బ్లాక్‌ బస్టర్‌ అవుతుంది’’ అని సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌ కుమార్‌ అన్నారు. వరుణ్‌ తేజ్‌ హీరోగా, మీనాక్షీ చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిం చిన చిత్రం ‘మట్కా’.

కరుణ కుమార్‌ దర్శకత్వంలో డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మించిన ఈ పాన్‌ ఇండియా మూవీ ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర మ్యూజిక్‌ డైరెక్టర్‌ జీవీ ప్రకాష్‌ కుమార్‌ విలేకరులతో మాట్లాడుతూ–‘‘నా తొలి ప్రాధాన్యత ఎప్పుడూ కథకే. ఆ తర్వాత డైరెక్టర్‌ గురించి ఆలోచిస్తాను. కరుణ కుమార్‌గారు అద్భుతమైన డైరెక్టర్‌. ‘మట్కా’ పీరియాడికల్‌ స్టోరీ. మ్యూజిక్‌ కూడా అదే తరహాలో తీసుకురావడం నాకు పెద్ద సవాల్‌గా అనిపించింది.

ఈ మూవీలో రెట్రో జోన్‌లో చేసిన ‘లేలే రాజా..’ పాట నాకు చాలా ఇష్టం. నిర్మాతలు పెద్ద బడ్జెట్‌తో ఈ సినిమా తీశారు. నెలలో 12 రోజులు నటన కోసం కేటాయిస్తాను. మిగతా రోజులన్నీ సంగీతం కోసం కేటాయిస్తాను. తెలుగులో ‘దసరా’ సినిమాలో ఒక పాత్ర చేయాల్సింది. కానీ, నా డేట్స్‌ కుదరలేదు. మంచి కథ, క్యారెక్టర్‌ ఉంటే తెలుగులో నటిస్తాను. వ్యక్తిగతంగా ప్రేమకథలకు సంగీతం ఇవ్వడం నాకు ఇష్టం’’ అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement