Gopichand Ramabanam Movie Release Date Announced, Deets Inside - Sakshi
Sakshi News home page

Gopichand Ramabanam Update: గోపీచంద్‌ 'రామబాణం' మూవీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Mar 4 2023 5:18 PM | Updated on Mar 4 2023 5:41 PM

Gopichand Ramabanam Movie Release Date Announced - Sakshi

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ చాన్నాళ్లుగా సరైన హిట్‌ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ మధ్య​కాలంలో ఆయన ఖాతాలో ఒక్క సాలిడ్‌ హిట్‌ కూడా లేదు. దీంతో ఈసారి ఎలాగైనా బాక్సాఫీస్‌ వద్ద కమర్షియల్‌ సక్సెస్‌ కోసం తెగ కష్టపడుతున్నారు. 'లక్ష్యం', 'లౌక్యం' లాంటి హిట్‌ చిత్రాల డైరెక్టర్‌  శ్రీవాస్‌ డైరెక్షన్‌లో  గోపీచంద్‌ నటిస్తున్న  హ్యాట్రిక్‌ సినిమా రామబాణం.

ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్‌, టీజర్‌ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాకు రిలీజ్ డేట్‌ వచ్చేసింది. ఈ సినిమాను సమ్మర్‌ కానుకగా మే5న విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో గోపీచంద్‌ సరసన డింపుల్‌ హయతి హీరోయిన్‌గా నటిస్తుండగా,జగపతి బాబు, కుష్బూ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement